srivalli song from pushpa gets a place in google to songs
Pushpa Srivalli Song : శ్రీవల్లి పాట తెలుసు కదా. పుష్ప సినిమా ఎంత హిట్ అయిందో.. శ్రీవల్లి పాట కూడా అంతే హిట్ అయింది. అసలు ఎక్కడ చూసినా శ్రీవల్లి పాట గురించే చర్చ. చూపే బంగారమాయెనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయనే అంటూ అల్లు అర్జున్ చెప్పు జారవిడుచుకొని మరీ డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే కదా. నిజానికి ఈ పాట తెలుగులో కంటే కూడా హిందీలో బాగా హిట్ అయింది. హిందీలో ఈ పాటను జావెద్ అలీ పాడాడు. అయితే.. విచిత్రం ఏంటంటే.. తెలుగు పాట కంటే కూడా హిందీ పాటకు చాలా రెస్పాన్స్ వచ్చింది. నార్త్ తో అయితే ఎక్కడ చూసినా ఈ పాట కొన్ని రోజుల పాటు మారుమోగిపోయింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన పుష్ప సినిమా సంచలనాలను సృష్టించింది. దేశవ్యాప్తంగా రికార్డులను బద్దలు కొట్టింది.
ముఖ్యంగా హిందీలో అయితే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా విడుదలై సరిగ్గా సంవత్సరం అవుతోంది. 2021 డిసెంబర్ లో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మేనరిజమ్స్ మాత్రం అదిరిపోయాయి. తగ్గేదేలే అంటూ తన తల కింద చేయి పెట్టి తిప్పడం అందరికీ నచ్చింది. దీంతో అప్పట్లో అదే పెద్ద ట్రెండ్ అయిపోయింది. సినిమాతో పాటు.. అందులోని అన్ని పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయితే.. గూగుల్ టాప్ సాంగ్స్ లో శ్రీవల్లి పాటకు మాత్రం చోటు దక్కింది. ప్రస్తుతం 2022 సంవత్సరం ముగింపు దశలో ఉన్నాం. ఇంకో 23 రోజులు అయితే 2023 ప్రారంభం అవుతుంది. దీంతో ఈ సంవత్సరం గూగుల్ లో టాప్ ట్రెండింగ్ లో ఉన్న పలు టాపిక్స్ కు సంబంధించిన డేటాను గూగుల్ రివీల్ చేసింది. అందులో టాప్ సాంగ్స్ లిస్టులో శ్రీవల్లి పాట ఉంది. టాప్ సాంగ్స్ లిస్టులో శ్రీవల్లి పాటకు పదో స్థానం దక్కింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడాడు.
srivalli song from pushpa gets a place in google to songs
హిందీలో మాత్రం జావెద్ అలీ పాడాడు. ఈ పాటకు గూగుల్ కూడా ఫిదా అయిపోయింది. దేశవ్యాప్తంగా కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఈ పాటకు పదో స్థానం లభించింది. ఇక.. అలీ సేథి పసూరి పాటకు మొదటి స్థానం లభించింది. బీటీఎస్ బట్టర్ పాటకు రెండో స్థానం లభించగా… అందులో చాంద్ బాలియాన్, డాగన్ బిలీవర్, బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ ఎవ్రీడే అనే పాటలు కూడా టాప్ 10 లో చోటు దక్కించుకున్నాయి. మొత్తానికి శ్రీవల్లి పాటకు గూగుల్ సెర్చ్ లో టాప్ ప్లేస్ దక్కడంపై మూవీ యూనిట్ కూడా ఖుషీ అవుతోంది. ఈ సినిమాకు సీక్వెల్ పుష్ప ది రూల్ షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ సినిమా వచ్చే సంవత్సరం విడుదలవుతుంది. ఈ సినిమాలోనూ ఫస్ట్ పార్ట్ లో ఉన్న క్యారెక్టర్లనే కొనసాగిస్తూ కథను పెంచారు. ఈ సినిమాకు సుకుమార్ డైరెక్టర్. చూద్దాం మరి.. సెకండ్ పార్ట్ ను సుకుమార్ ఇంకెంత బ్లాక్ బస్టర్ చేస్తాడో?
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…
Wife : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…
Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…
This website uses cookies.