Home » Entertainment » Star Maa Tv Bb Jodi Dance Show Rating And Response
Entertainment

BB Jodi Dance Show : స్టార్‌ మా బిబి జోడీ.. ఇంకా ఎన్నాళ్లు అవే మొహాలను చూపిస్తార్రా బాబు..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: January 29, 2023 4:40 pm
Advertisement

BB Jodi Dance Show : తెలుగు బిగ్ బాస్ లో కనిపించిన వారు ఇప్పుడు బిబి జోడీ అనే డాన్స్ కాంపిటీషన్ లో సందడి చేస్తున్నారు. స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న ఈ డాన్స్ కార్యక్రమానికి జడ్జ్‌ లుగా సీనియర్ హీరోయిన్ రాధ ఇంకా మరో హీరోయిన్ సదా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ డాన్స్ షో విషయంలో ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యాంకర్ గా శ్రీముఖి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కార్యక్రమాన్ని రసవత్తరంగా మార్చేందుకు ఆమె చాలా కృషి చేస్తోంది, అయినా కూడా కార్యక్రమం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోతుంది.

Advertisement

srimukhi latest photoshoot viral

అందుకు కారణం బిగ్ బాస్ లో చూసిన మొహాలనే మళ్లీ మళ్లీ ఏం చూస్తాం అంటూ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారట. ముఖ్యంగా కౌశల్ మరియు అఖిల్ మధ్య గొడవ పెట్టి బిగ్ బాస్ లో తరహా గొడవలతో బిబి జోడి కి రేటింగ్ తెప్పించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. కానీ అది వర్కౌట్ అవ్వడం లేదు. కౌశల్ కి జోడిగా అభినయశ్రీ మరియు అఖిల్ కి జోడిగా తేజస్వి మడివాడ డాన్స్ పార్ట్నర్ గా ఉన్నారు. ఈ రెండు జంటలు బిబి జోడి ఫైనల్ వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తోంది. ఈ రెండు జంటల మధ్య ప్రతి ఎపిసోడ్ లో కూడా గొడవ జరగడం,

Advertisement

star maa tv BB Jodi Dance Show rating and response

ఆ గొడవను మరింత పెంచే విధంగా జడ్జిలు మాట్లాడడం జరుగుతుంది. ఇక అరియానా అందాల ఆరబోత, అవినాష్ కామెడీ ఇవి కూడా డిబి జోడి కార్యక్రమాన్ని సక్సెస్ చేయలేక పోతున్నాయి. మెహబూబ్ సిక్స్ ప్యాక్ చూపించినంత మాత్రాన ప్రేక్షకులు చూసి నోరు వెళ్ళబెడతారు అనుకుంటే పొరపాటే.. అందుకే కంటెస్టెంట్స్ విషయంలో కాస్త కొత్తగా ఆలోచించాలని ప్రేక్షకులు నిర్వాహకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. సోషల్ మీడియాలో బిబి జోడి పై పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. స్టార్‌ మా వారు ఇలాంటి షో లను తీసుకు వస్తే జెమిని టీవీ మాదిరిగా కనుమరుగు అవ్వాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి