Prabhas : ప్రభాస్ పెళ్లి టాపిక్ పై ఊహించని రీతిలో సోషల్ మీడియాలో రియాక్ట్ అయిన కృతి సనన్..!!
Prabhas : దాదాపు రెండు మూడు రోజుల నుండి సోషల్ మీడియాని వార్త ఊపేస్తోంది. అదే ప్రభాస్ బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ పెళ్లి వార్త. వీరిద్దరూ “ఆదిపురుష్” లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి వీరిద్దరి మధ్య రిలేషన్ మొదలైనట్లు ప్రచారం స్టార్ట్ అయింది. దక్షిణాదిలో సినిమా రంగంలో కంటే ఉత్తరాదిలో ఈ వార్తలు భయంకరంగా వైరల్ అయ్యాయి. ఏకంగా ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మరణించిన సమయంలో సైతం బాలీవుడ్ మీడియా..కృతి.. ప్రభాస్ […]
Prabhas : దాదాపు రెండు మూడు రోజుల నుండి సోషల్ మీడియాని వార్త ఊపేస్తోంది. అదే ప్రభాస్ బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ పెళ్లి వార్త. వీరిద్దరూ “ఆదిపురుష్” లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి వీరిద్దరి మధ్య రిలేషన్ మొదలైనట్లు ప్రచారం స్టార్ట్ అయింది. దక్షిణాదిలో సినిమా రంగంలో కంటే ఉత్తరాదిలో ఈ వార్తలు భయంకరంగా వైరల్ అయ్యాయి. ఏకంగా ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మరణించిన సమయంలో సైతం బాలీవుడ్ మీడియా..కృతి.. ప్రభాస్ రిలేషన్ గురించి ఎక్కువ ప్రచారం చేయడం జరిగింది.
మరోపక్క అంతకుముందు ఒక టీవీ షోలో కృతి పాల్గొన్న సమయంలో కార్తీక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్, ప్రభాస్ ఈ ముగ్గురిలో ఎవరితో ఫ్లర్ట్ చేస్తారు? ఎవరితో డేట్ చేస్తారు? ఎవరిని పెళ్లి చేసుకుంటారు అనే ప్రశ్న ఎదురవగా.. కార్తీక్ తో ఫ్లర్టింగ్, టైగర్ తో డేటింగ్, ప్రభాస్ నీ పెళ్లి చేసుకుంటానని షాకింగ్ సమాధానమిచ్చింది. ఇక ఆ తర్వాత “భేడియా” మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా వరుణ్ ధావన్ ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే కార్యక్రమంలో కృతి కూడా ఉంది. ఈ సమయంలో కృతి మనసులో సౌత్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి ఉన్నాడు.
అతను ఇప్పుడు దీపిక షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అంటూ పరోక్షంగా ప్రభాస్ ..కృతి రిలేషన్ లో ఉన్నట్లు చెప్పడం జరిగింది. దీంతో కృతితో ప్రభాస్ పెళ్లి అనే వార్తలు మరింతగా వైరల్ గా మారాయి. పరిస్థితి ఇలా ఉండగా వ్యవహారం మొత్తం అదుపు తప్పెలా కనిపిస్తూ ఉండడంతో జనాల్లో కి వేరేలాగా వెళుతుంది అనే ఆలోచనతో కృతి జాగ్రత్త పడి సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్ళి టాపిక్ పై రియాక్ట్ అయింది. అటువంటిది ఏమి లేదని.. బేస్ లెస్ రూమర్స్‌ను నమ్మవద్దని, తన పెళ్లి నిశ్చయం అయిందని వస్తున్న వార్తలు కేవలం ఫేక్ న్యూస్ మాత్రమే అని స్పష్టం చేశారు. అలంటి వార్తలు అస్సలు నమ్మవద్దని తెలియజేసింది.