
story behind Chiranjeevi is the allu ramalingaiah
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో ఉన్నత స్థానంలో నిలిచిన విషయం మనందరికి తెలిసిందే. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు. ప్రాణం ఖరీదు సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడిగా పరిచయమైనా.. తొలిసారిగా కెమెరా ముందు పునాది రాళ్లు చిత్రంతో పలకరించాడు. కెరీర్ మొదట్లో హీరోగా విలన్ గా, చిన్న చిన్న అతిధి పాత్రల్లో , నలుగురు హీరోల్లో ఒకడిగా నిలుస్తూ వచ్చిన చిరంజీవి తనదైన నటన, డాన్సులతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు.మెగాస్టార్ గా అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు చిరంజీవి.
నటుడుగా ఎదుగుతున్న సమయంలోనే అంటే..సినిమాల్లో అడుగు పెట్టిన రెండేళ్లకే టాలీవుడ్ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖని వివాహం చేసుకున్నారు.చిరంజీవి కష్టపడే తత్వాన్ని అప్పట్లోనే గుర్తించిన అల్లు రామలింగయ్య తన కుమార్తె సురేఖ ను చిరంజీవికి ఇచ్చి 20వ తేదీ ఫిబ్రవరి 1980లో పెళ్లి చేశారు. చిరంజీవి పెళ్లి చేసుకుంటున్న సమయంలో నూతన్ ప్రసాద్‌తో కలిసి ‘తాతయ్య ప్రేమలీలలు’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న చిరంజీవి షర్ట్ చిరిగిపోయింది. అయితే ముహర్త సమయానికి ఆలస్యం అవుతుందని.. అదే షర్ట్ తో పెళ్లి మండపానికి చిరంజీవి వెళ్లడం..
story behind Chiranjeevi is the allu ramalingaiah
చిరిగిన బట్టలతోనే సురేఖ మేడలో తాళిని కట్టడం జరిగిందని ఒకానొక సందర్భంలో చిరంజీవి తన పెళ్లి జ్ఞాపకాలను తన భార్య సురేఖతో కలిసి చిరంజీవి పంచుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి సమయానికి చిరంజీవికి పెద్దగా స్టార్‌డం లేదు. కాని ఆయన మావయ్య అల్లు రామలింగయ్య స్టార్ కమెడీయన్ స్టేటస్ అనుభవిస్తున్నారు. అయితే అల్లు రామలింగయ్య గారు అల్లుడిని చేసుకోవడం వెనుక పెద్ద కథే నడిచింది. చిరంజీవి చెన్నైలో ఉన్నప్పుడు అనుకోకుండా ఓ రోజు తన స్నేహితుడు సత్యనారాయణతో కలిసి అల్లు రామలింగయ్య గారి ఇంటికి వెళ్ళాడు.సత్యనారాయణ కి అల్లు రామలింగయ్య స్వయానా పెదనాన్న. అయితే ఆ టైములో రామలింగయ్య గారు ఇంట్లో లేరు. వాళ్ళ అమ్మాయి సురేఖ మరియు కుటుంబ సభ్యులు ఉన్నారు.
వాళ్ళను లోపలికి పిలిచి కూర్చోబెట్టారు. అప్పుడు సురేఖ వీళ్లకు కాఫీ పెట్టగా, ఆ తర్వాత సురేఖ మరియు ఆమె కుటుంబ సభ్యులు చిరు గురించి ఆరా తీశారు. అప్పటికే అల్లు రామలింగయ్య గారితో చిరు మూడు సినిమాల్లో కలిసి నటించడం పైగా సత్యనారాయణ కి కూడా దగ్గర మనిషి కావడంతో చిరు గురించి ఎంక్వయిరీ చేశారు అల్లు రామలింగయ్య. అయితే అసలు సురేఖని ఇండస్ట్రీ వాళ్లకి ఇచ్చి పెళ్లి చేయడం అల్లు రామలింగయ్యకి ఇష్టం లేదట. కానీ సత్యనారాయణ అలాగే రామలింగయ్య గారి సన్నిహితుడు అయిన జయకృష్ణ .. చిరు గురించి మంచిగా చెప్పడంతో ఒకసారి ఇండస్ట్రీలో ఉన్న వారందరితో ఆరాలు తీసి పెళ్లి చేశారట. కూతురిని అత్తగారింటికి పంపే సమయంలో రామలింగయ్య చాలా ఎమోషనల్ అయ్యారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.