
Pawan Kalyan : డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్‌కి కాల్ చేస్తే అలా రియాక్ట్ అయ్యారన్న సుధాకర్..!
Pawan Kalyan : హీరోగా కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం సుధాకర్. తెలుగు వాళ్లే కాదు తమిళ సినీ ప్రేమికులు కూడా సుధాకర్ నటన ని ఎంజాయ్ చేసిన వాళ్లే అంటే అతిశయోక్తి కాదు. తమిళంలో చాలా సినిమాల్లో హీరోగా చేసాడు. ఇక తెలుగులో ఆయన పండించిన హాస్య నటనకి థియేటర్స్ మొత్తం నవ్వులతో దద్దరిల్లిపోయాయి.తనకి మాత్రమే సాధ్యమయ్యే డైలాగ్ డెలివరీ తో తెలుగు సినిమా పుస్తకంలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీ ని ఏర్పాటు చేసుకున్నాడు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు అవి ట్రెండింగ్ లో ఉన్నాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధాకర్ తన కెరియర్ గురించి, అలాగే తన కొడుకు సినీ ఎంట్రీ గురించి ఎన్నో విషయాలు వెల్లడించారు.ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో తనకు చిరంజీవి తో పాటు ఇతర హీరోలతో కూడా ఎంతో మంచి అనుబంధం ఉందని తెలిపారు.ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నన్ను చాలా ఆప్యాయంగా అన్నయ్య అంటూ పిలిచేవారు.ఇక మా ఆవిడను వదినా అని ఎంతో ప్రేమగా పిలిచేవారని తెలిపారు. ఇక నాకు చిరంజీవి ఎంతో పవన్ కళ్యాణ్ కూడా అంతేనని సుధాకర్ తెలిపారు.ఇక ఆయన ఎన్నికలలో భారీ మెజారిటీ సాధించి డిప్యూటీ సీఎం అయిన తర్వాత తాను ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పానని ఆ సమయంలో పవన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని సుధాకర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Pawan Kalyan : డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్‌కి కాల్ చేస్తే అలా రియాక్ట్ అయ్యారన్న సుధాకర్..!
ఇక పవన్, సుధాకర్ లు గోకులంలో సీత, సుస్వాగతం, ఖుషి లో కలిసి నటించారు. ఆ మూడు కూడా ఘన విజయం సాధించాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి సుధాకర్ అనారోగ్యంతో బాధపడుతున్నారన్న విషయం అందరకి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో కలిపి సుమారు 600 సినిమాల దాకా చేసాడు. కొన్ని సినిమాలని కూడా నిర్మించాడు.. ఇండస్ట్రీకి దూరమైన సుధాకర్ మరణించారు అంటూ ఎన్నోసార్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.ఇలా వార్తలు వచ్చిన ప్రతిసారి నేను బ్రతికే ఉన్నానని చెప్పుకోవాల్సిన పరిస్థితి సుధాకర్ కి ఎదురైంది.ఇకపోతే ఇటీవల తన కుమారుడు బెన్నీ సైతం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో ఈయన కూడా పలు బుల్లితెర కార్యక్రమాలకు అలాగే కొన్ని ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేశారు.
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.