Mahesh Babu sudheer babu rejects pan india movie
Mahesh Babu : టాలీవుడ్ యంగ్ హీరోలలో సుధీర్ బాబు ఒకరు. ఆయన మహేష్ క్రేజ్ ఏ మాత్రం వాడకుండా సినిమాలలో సత్తా చాటుతున్నాడు.. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా, మహేష్ బావగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తన ప్రతిభతోనే సుధీర్ బాబు హీరోగా నిలదొక్కుకున్నాడు. ఎస్ఎంఎస్, ప్రేమ కథా చిత్రం, సమ్మోహనం లాంటి హిట్స్ తో ప్రస్తుతం టాలీవుడ్‌లో దూసుకుపోతున్న సుధీర్ బాబు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి 10 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ సందర్భంగా సుధీర్ బాబు బుధవారం అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆయన మొదటి సినిమా ‘ఎస్ఏంఎస్ కాగా, రెండో సినిమా ‘ప్రేమ కధా చిత్రమ్’ తో కమర్షియల్ విజయాన్ని అందుకున్న ఆయన బాలీవుడ్ లో కూడా మంచి సినిమాలు చేసే స్థాయికి వెళ్ళాడు.
తాతినేని సత్య దర్శకత్వంలో శివ మనసులో శృతి అనే సినిమా చేస్తున్న సమయంలో తాను వినకూడని ఒక మాట సినిమాటోగ్రాఫర్ నోటివెంట విన్నానని సుధీర్ బాబు వెల్లడించారు. అప్పట్లో కేరవాన్ ఫెసిలిటీ లేకపోవడంతో అందరూ ఆరుబయటే ఉండేవారని ఆ సమయంలో సదరు సినిమాటోగ్రాఫర్ తన అసిస్టెంట్ తో ఈ సినిమా వర్కవుట్ కాదు ఇతని ఫేస్ ఫోటోజనిక్ గా లేదు అని చెప్పడం విన్నాను అని వెల్లడించారు.అయితే ఆ మాటలు అప్పుడు బాధ కలిగించినా తనలో ఫైర్‌ని రగిలించాయని, తాను బాగా నటించాలనే కసిని పెంచాయని తెలిపారు సుధీర్‌బాబు. ఆ సమయంలో సుధీర్ బాబు ఏడ్చాడట కూడా. లుక్ వైజ్‌గా కనెక్ట్ కావడం కష్టమని తెలిసి, ఇక నటనపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారట. అలా తొలి సినిమా తనకు మంచి పేరు తెచ్చిందన్నారు సుధీర్‌బాబు.
Mahesh Babu sudheer babu rejects pan india movie
రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటిస్తున్న `బ్రహ్మాస్త్ర` భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ మూవీలో విలన్ పాత్రలో నటించే అవకాశం మొదట సుధీర్ బాబుకి వచ్చింది. కానీ ఆ ఆఫర్ ని తానూ రిజెక్ట్ చేసినట్లు తెలిపారు. ఆ సమయంలో ఇంద్రగంటిగారితో `సమ్మోహనం` ఆఫర్ వచ్చిందని, ఇది చాలా కూల్‌గా సాగే మూవీ అని, విలన్‌గా చేశాను, కానీ ఇలాంటి సెటిల్డ్ నటన చూపించే సినిమా చేయలేదని అందుకే `బ్రహ్మస్త్ర` రిజక్ట్ చేసి `సమ్మోహనం` ఓకే చేశానని తెలిపారు సుధీర్‌బాబు.
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
This website uses cookies.