Sudheer Rashmi in DHEE 13 Kings vs Queens
Sudheer – Rashmiబుల్లితెరపై రష్మీ సుధీర్ అనే అంకం ఎప్పటికీ బోర్ కొట్టదు. ఎన్ని ఏళ్లు అవుతున్నా కూడా ఆ జంట అందరినీ అలరిస్తూనే ఉంటుంది. అలా సుధీర్ రష్మీ జంటగా బుల్లితెరపై చేసే కెమిస్ట్రీకి అందరూ ఫిదా అవుతూనే ఉంటారు. వారిద్దరి మధ్య అలాంటిదేమీ లేదని తెలిసినా కూడా జనాలు మాత్రం వారిని అంతే శ్రద్దతో చూస్తుంటారు. తెరపై వారు చేసే మ్యాజిక్‌కు అందరూ పడిపోతుంటారు. తాజాగా మరోసారి రొమాన్స్‌కు తెరలేపారు. ప్రస్తుతం ఈ జంట మరోసారి ట్రెండ్ అవుతోంది.
తాజాగా వదిలిన ఢీ ప్రోమోలో ఓ రేంజ్‌లో రచ్చ చేశారు. మొదటగా దీపిక పిల్లి, రష్మి ఇద్దరూ కూడా వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి.. హైపర్ ఆది, సుధీర్‌లకు గులాబీ పువ్వులను ఇచ్చారు. ఆ తరువాత సుధీర్ రష్మీకి, ఆది దీపికపిల్లికి రోజా పువ్వు ఇచ్చారు. అందులోనూ సుధీర్ మరీ మోకాళ్ల మీద నిల్చుని ఇచ్చేశాడు. అనంతరం రష్మీ వచ్చి సుధీర్‌తో సాల్సా డ్యాన్స్ వేసింది. అందులో రష్మీ తెగ సిగ్గుపడిపోయింది. ఇప్పుడు సిగ్గు తొలకరి మొగ్గలేసినట్టు చేసేసింది.
Sudheer Rashmi in DHEE 13 Kings vs Queens
అలా ఈ ఇద్దరి రొమాన్స్ ఎప్పుడూ కూడా ఫ్రెష్‌గా ఉంటూ.. ఏదో తెలియని మ్యాజిక్‌ను క్రియేట్ చేస్తుంటుంది. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అంతకంటే ఏమీ లేదని ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చారో వారికే తెలియదు. కానీ తెర మీదకు వచ్చే సరికి మళ్లీ రెచ్చిపోతారు. తాము కేవలం ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు అలా చేస్తుంటామని, తెర వెనుక మంచి స్నేహితుల మాత్రమేనని చెప్పుకొస్తుంటారు. మొత్తానికి తాజా ప్రోమోలో మాత్రం సుధీర్ రష్మీ రొమాన్స్‌తో టాప్ లేపేశారు.
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
This website uses cookies.