Home » Entertainment » Sudheer Showers Love On Rashmi
Entertainment

Sudheer : నా కోసమే పుట్టావ్.. రష్మీపై సుధీర్ కామెంట్స్.. వీడియో

Authored By
Cinema Desk
The Telugu News | Published on: May 29, 2021, 3:20 pm
Advertisement

Sudheer యాంకర్ రష్మీ సుధీర్ Sudheer కాంబినేషన్ అంటే జనాలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొన్నేళ్లుగా బుల్లితెరపై రహస్యంగా దోబూచులాట ఆడుతున్నారు. తమ ఇద్దరి మధ్య ఏమీ లేదని చెబుతూనే తెరపై మాత్రం ప్రేమికుల్లా నటించేస్తారు. తాజాగా సుధీర్ తన మనసులోని ప్రేమను మరోసారి బయటపెట్టేశాడు. వచ్చే వారం ప్రసారం కానున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది.

Advertisement

Sudheer సుధీర్ మీద రష్మీ సెటైర్లు

Sudheer Showers Love On rashmi

ఇందులో సుధీర్ Sudheer మీద రష్మీ వేసిన సెటైర్లు వైరల్ అవుతున్నాయి. స్కిట్‌లో భాగంగా సుధీర్‌పై దారుణమైన కామెంట్లు చేసింది. సొరంగాల సుధీర్ అని రోజా అంటే.. తవ్వి తవ్వి తవ్వి ఇక్కడి వరకు వచ్చాడంటూ రష్మీ కౌంటర్ వేశారు. ఇక మరో స్కిట్‌లో రష్మీ సెటైర్ వేస్తూ.. ఓ ముదిరిపోయిన బెండకాయ.. బెండకాయలను ఏరుతున్నాడంటూ పరువుతీసేశారు. ఇక పండుగాడు అనే డైలాగ్ చెబుతున్న సుధీర్‌ను.. దిండుగాడు అంటూ పరువుతీసేశారు.

Advertisement

ఇక చివర్లో సుధీర్ Sudheer మాత్రం తన ప్రేమను బయటపెట్టే ప్రయత్నం చేశారు. రష్మీ బర్త్ డే కంటే పండుగ ఏదైనా ఉంటుందా? అని అనేయడంతో రష్మీ మురిసిపోయారు. కేవలం పుట్టిన రోజు అని నువ్ అనుకుంటున్నావ్.. నా కోసం పుట్టావ్ అని నేను అనుకుంటున్నాను అని సుధీర్ తన మనసులోని ప్రేమను బయటపెట్టేశారు. మొత్తానికి రష్మీ బర్త్ డే స్పెషల్ స్కిట్ అంటూ దుమ్ములేపేందుకు రెడీగా ఉన్నారు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి