Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ప్రస్తుతం బుల్లితెరపై బిజీ ఆర్టిస్ట్‌లలో ఒకరు. ఇన్నాళ్లు ఈటీవీలో సందడి చేసిన సుధీర్ ఇప్పుడు మాటీవీకి పరిమితం అయ్యారు. ఈటీవీలో జబర్ధస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలలో అద్భుతమైన పర్‌ఫార్మెన్స్ ఇచ్చేవాడు. ముఖ్యంగా శ్రీదేవి డ్రామా కంపెనీలో హోస్టింగ్ చేస్తూనే అలరిస్తూ వచ్చాడు. నటి ఇంద్రజ కూడా అదే షోకి జడ్జిగా ఆడియన్స్‌ను అలరించారు. మొదట్లో అప్పుడప్పుడు గెస్ట్‌గా వచ్చిన ఇంద్రజ.. శ్రీదేవి డ్రామా కంపెనీ షో ద్వారా ఫుల్‌టైమ్‌గా జడ్జిగా మారారు. అయితే సుడిగాలి సుధీర్ ఆ షో నుంచి వైదొలిగిన తరువాత ఇంద్రజ కూడా తప్పుకున్నారు.
ప్రస్తుతం ఆమె జబర్దస్త్ షోలో రోజా ప్లేస్‌లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. సుధీర్ విషయానికి వస్తే పార్టీ చేద్దాం పుష్ప అనే కార్యక్రమానికి కూడా యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.ఇకపోతే ఈ కార్యక్రమానికి సుడిగాలి సుదీర్ తీసుకొనే రెమ్యూనరేషన్ కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ కార్యక్రమానికి సుధీర్ ఏకంగా ఒక షెడ్యూల్ కోసం పది నుంచి 15 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈయనకు స్టార్ మా రెట్టింపు పారితోషకం ఆఫర్ చేయడంతో ఈయన ఈటీవీ వదిలి స్టార్ మా కార్యక్రమాలలో సందడి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈటీవీ కార్యక్రమాల నుంచి దూరమైన సుధీర్ ప్రస్తుతం స్టార్ మా కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
తాజాగా పార్టీ చేద్దాం పుష్ప పార్ట్ 2 ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమొ విడుదల కాగా, ఇందులో దీపికా పిల్లి, సుడిగాలి సుధీర్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేశారు. ప్రేక్షకులు కోరగానే మాతో వచ్చి డ్యాన్స్ చేసినందుకు థ్యాంక్స్ అంటూ సుడిగాలి సుధీర్ అనగానే వెంటనే అనసూయ ప్రేక్షకులు ఎందుకు కోరారు, మీ మనసు కోరిందని నవ్వులు పూయించింది. ఇక దీపిక మాట్లాడుతూ, ఇలా నాకు కన్ను కొట్టి పిలిచాడు అని చెప్పగా, దానికి నాగబాబు ఇదొక్క సారి క్షమించా, ఇంకొక 20 సార్లు వరకు ఛాన్స్ ఇస్తా, తర్వాత అలా చేయకు అంటూ అందరని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.