Home » Entertainment » Sudigali Sudheer Act In Director Veeru Potla Movies
Entertainment

Sudigali Sudheer : ఓరి నాయనో సుడిగాలి సుధీర్ రేంజ్ పెరిగిపోయింది… ఎంత పెద్ద డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడో చూడండి …!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 22, 2022, 5:00 pm
Advertisement

Sudigali Sudheer : బుల్లితెరపై ఎంతో పాపులారిటీని దక్కించుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు వెండితెరపై కూడా తనేంటో నిరూపించుకుంటున్నాడు. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తు బిజీగా ఉన్నాడు. ఇటీవల హీరోగా చేసిన గాలోడు సినిమా కంటెంట్ పరంగా రొటీన్ గా ఉన్న బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించింది. దీంతో ఇప్పుడు కొంతమంది చిన్న నిర్మాతలు సుడిగాలి సుధీర్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక సుధీర్ కూడా తొందరపడకుండా మంచి ప్రాజెక్టులను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు.

Advertisement

ముందుగా నిర్మాతల నుంచి అడ్వాన్స్ తీసుకోకుండా పూర్తి కథ విన్న తర్వాత అగ్రిమెంట్ పై సంతకం చేస్తున్నాడట. అయితే ఇటీవల ఒక సీనియర్ రైటర్ దర్శకుడు సుడిగాలి సుధీర్ ని కలిసినట్లు తెలుస్తుంది. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో మంచి రచయితగా గుర్తింపు పొందిన వీరు పొట్ల ఆ తర్వాత బిందాస్, నాగార్జున రగడ సినిమా తో మంచి డైరెక్టర్ గా పేరు దక్కించుకున్నాడు. ఆ తర్వాతి రెండు సినిమాలు వీడు గోల్డ్ ఎహే, దూసుకెళ్తా సినిమాలు అంతగా ఆడలేదు.

Sudigali Sudheer act in director veeru potla movies

Advertisement

ఇక మళ్ళీ అక్కినేని హీరోలతో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తుంది. కానీ ఇంతవరకు ఏ ప్రాజెక్టు ఓకే కాలేదు. ఇప్పుడు సుధీర్ కామెడీ తోనే కాకుండా సినిమాలపరంగా గాలోడు సినిమాతో మంచి టాక్ ను సంపాదించుకున్నాడు. దీంతో వీరు పోట్ల అతడితో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక కథ గురించి కూడా వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అది నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి