Sudigali Sudheer Auto Ram Prasad Bike Gift To Getup Srinu
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్, ఆటో రాం ప్రసాద్, గెటప్ శ్రీనుల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ వారిని కలిపింది. ఇక అలా ఒక్కచోటకు వచ్చిన క్షణం నుంచి నేటి వరకు వారు ఎప్పుడూ దూరమవ్వలేదు. ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. కష్టసుఖాల్లో తోడుగా నిల్చున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఎవరి దారి వారిదే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో సుధీర్, శ్రీను కనిపించడం లేదు.
వారిద్దరూ లేకపోయినా కూడా స్కిట్టును కిందా మీదా పడి లాక్కొస్తున్నాడు రాం ప్రసాద్. అయితే రాకింగ్ రాకేష్ మాత్రం రాం ప్రసాద్ ప్రస్తుత పరిస్థితి మీద, వారి స్నేహం మీద స్కిట్ వేసి అందరినీ ఏడిపించాడు. కెరీర్ కొత్తలో వారు ముగ్గురూ ఎలా ఉండేవారో, ఎలా స్కిట్లు రాసుకునే వారో చూపించాడు. అందులో భాగంగా కొన్ని విషయాలను బయటపెట్టేశాడు. ఈ క్రమంలో కెరీర్ ప్రారంభంలో ఒకరికొకరు ఇచ్చుకున్న గిఫ్టులను చెప్పుకొచ్చారు. గెటప్ శ్రీనుకి పెళ్లైన కొత్తలో కాస్త కష్టంగా ఉంటే.. ట్రావెలింగ్‌కు ఇబ్బంది అవుతోందంటే..
Sudigali Sudheer Auto Ram Prasad Bike Gift To Getup Srinu
సుధీర్, రాం ప్రసాద్ కలిసి బైక్ కొనిచ్చారట. ఇక రాం ప్రసాద్ కోసం శ్రీను, సుధీర్ కలిసి కాస్ట్ లీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారట. మొత్తానికి ఈ విషయాలన్నీ రాకింగ్ రాకేష్ వేసిన స్కిట్ ద్వారా బయటకు వచ్చాయి. ఇక ఈ స్కిట్ చూస్తున్నంత సేపు ఆటో రాం ప్రసాద్ కంటి నుంచి నీరు కారుతూనే ఉంది. అలా ఈ ముగ్గురి స్నేహ బంధం గురించి మొత్తానికి స్కిట్ ద్వారా అందరికీ మరోసారి చూపించినట్టు అయింది. మళ్లీ ఈ ముగ్గురు కలిసి ఎప్పుడు స్కిట్లు చేస్తారో చూడాలి.
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
This website uses cookies.