Sudigali Sudheer : స్నేహమంటే గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, రాం ప్రసాద్‌లదే.. కెరీర్ ప్రారంభంలో కాస్ట్ లీ గిఫ్ట్‌లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sudigali Sudheer : స్నేహమంటే గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, రాం ప్రసాద్‌లదే.. కెరీర్ ప్రారంభంలో కాస్ట్ లీ గిఫ్ట్‌లు

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్, ఆటో రాం ప్రసాద్, గెటప్ శ్రీనుల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ వారిని కలిపింది. ఇక అలా ఒక్కచోటకు వచ్చిన క్షణం నుంచి నేటి వరకు వారు ఎప్పుడూ దూరమవ్వలేదు. ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. కష్టసుఖాల్లో తోడుగా నిల్చున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఎవరి దారి వారిదే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో సుధీర్, శ్రీను కనిపించడం లేదు. వారిద్దరూ లేకపోయినా […]

 Authored By prabhas | The Telugu News | Updated on :5 June 2022,12:00 pm

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్, ఆటో రాం ప్రసాద్, గెటప్ శ్రీనుల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ వారిని కలిపింది. ఇక అలా ఒక్కచోటకు వచ్చిన క్షణం నుంచి నేటి వరకు వారు ఎప్పుడూ దూరమవ్వలేదు. ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. కష్టసుఖాల్లో తోడుగా నిల్చున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఎవరి దారి వారిదే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో సుధీర్, శ్రీను కనిపించడం లేదు.

వారిద్దరూ లేకపోయినా కూడా స్కిట్టును కిందా మీదా పడి లాక్కొస్తున్నాడు రాం ప్రసాద్. అయితే రాకింగ్ రాకేష్ మాత్రం రాం ప్రసాద్ ప్రస్తుత పరిస్థితి మీద, వారి స్నేహం మీద స్కిట్ వేసి అందరినీ ఏడిపించాడు. కెరీర్ కొత్తలో వారు ముగ్గురూ ఎలా ఉండేవారో, ఎలా స్కిట్లు రాసుకునే వారో చూపించాడు. అందులో భాగంగా కొన్ని విషయాలను బయటపెట్టేశాడు. ఈ క్రమంలో కెరీర్ ప్రారంభంలో ఒకరికొకరు ఇచ్చుకున్న గిఫ్టులను చెప్పుకొచ్చారు. గెటప్ శ్రీనుకి పెళ్లైన కొత్తలో కాస్త కష్టంగా ఉంటే.. ట్రావెలింగ్‌కు ఇబ్బంది అవుతోందంటే..

Sudigali Sudheer Auto Ram Prasad Bike Gift To Getup Srinu

Sudigali Sudheer Auto Ram Prasad Bike Gift To Getup Srinu

సుధీర్, రాం ప్రసాద్ కలిసి బైక్ కొనిచ్చారట. ఇక రాం ప్రసాద్ కోసం శ్రీను, సుధీర్ కలిసి కాస్ట్ లీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారట. మొత్తానికి ఈ విషయాలన్నీ రాకింగ్ రాకేష్ వేసిన స్కిట్ ద్వారా బయటకు వచ్చాయి. ఇక ఈ స్కిట్ చూస్తున్నంత సేపు ఆటో రాం ప్రసాద్ కంటి నుంచి నీరు కారుతూనే ఉంది. అలా ఈ ముగ్గురి స్నేహ బంధం గురించి మొత్తానికి స్కిట్ ద్వారా అందరికీ మరోసారి చూపించినట్టు అయింది. మళ్లీ ఈ ముగ్గురు కలిసి ఎప్పుడు స్కిట్లు చేస్తారో చూడాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది