Home » Entertainment » Sudigali Sudheer Fans Fire On Anchor Omkar
Entertainment

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌ కెరీర్ నాశనంకు ‘అన్నయ్య’ కారణం.. వార్తల్లో నిజం ఎంత?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: October 15, 2022, 11:00 am
Advertisement

Sudigali Sudheer : ఈటీవీ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సుడిగాలి సుదీర్ సూపర్ స్టార్ రేంజ్ ని దక్కించుకున్న విషయం తెలిసిందే. బుల్లి తెర సూపర్ స్టార్ అంటూ సుడిగాలి సుదీర్ ని ఆయన అభిమానులు ముద్దుగా పిలుచుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బుల్లి తెరపై సుధీర్ కనిపించడం లేదు. వెండి తెరపై ఆయన చేసిన సినిమాలు ఆకట్టుకోవడం లేదు. ఈ సమయంలో బుల్లి తెరపై మళ్ళీ సుదీర్ కనిపిస్తే చూడాలని కోరుకుంటున్నాం అంటూ ఆయన అభిమానులు ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నంతపనిచేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలను హాయిగా చేసుకుంటున్న సుడిగాలి సుదీర్ ని ఎవరు స్టార్ మా లోకి లాగారు అనే విషయమై అర్థం అవడం లేదు..

Advertisement

లేని పోని హామీలను కల్పించి ఊహలను ఆయనకు చెప్పి రెచ్చగొట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాన్ని మాన్పించడంతో పాటు జబర్దస్త్ నుండి కూడా బయటకు వచ్చేలా చేశారు. అది ఎవరు అంటే.. ఎక్కువ శాతం మంది ఓంకార్ అన్నయ్య అనే పేరును చెబుతున్నారు. గతంలో కామెడీ స్టార్స్ కార్యక్రమాన్ని స్టార్ మా కోసం ఓంకార్ నిర్వహించాడు. ఆ కార్యక్రమం కోసమే సుడిగాలి సుదీర్ తో పాటు మరికొందరు జబర్దస్త్ కమెడియన్స్ ని ఓంకార్ తన ప్రొడక్షన్ హౌస్ లోకి ఆకర్షించే ప్రయత్నం చేశాడు. ఎక్కువ పారితోషికం ఇవ్వడంతో పాటు ఇతరత్రా కారణాల వల్ల చాలా మంది కమెడియన్స్ అటు వైపు ఆకర్షితులయ్యారు. తీరా అటు వెళ్ళిన తర్వాత కామెడీ స్టార్స్ కార్యక్రమంలో ఎత్తేశారు. ఏమాత్రం అవకాశాలు లేకుండా వారిని అనాధలుగా మార్చేశారంటూ బుల్లి తెర వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

Sudigali Sudheer fans fire on anchor omkar

Advertisement

సుడిగాలి సుదీర్ చాలా కాలం ఖాళీగా ఉన్న తర్వాత ఎట్టకేలకు ఆహా ఓటీటీలో ప్రసారం కాబోతున్న ఒక కామెడీ షో కోసం రెడీ అవుతున్నాడు. ఆ కామెడీ షో వర్కౌట్ అయితే పర్వాలేదు.. లేదంటే మరో రెండు మూడు నెలల తర్వాత సుడిగాలి సుదీర్ మళ్లీ అవకాశాల కోసం వెతుక్కోవలసిన పరిస్థితి.. అలా సుడిగాలి సుదీర్ కెరియర్ ను నాశనం చేశారంటూ ఆయన అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి సుదీర్ కెరియర్ నాశనం చేశారు అంటూ ఓంకార్ ని విమర్శిస్తున్న సమయంలో కొందరు విమర్శలను కొట్టి పారేస్తున్నారు. హీరోగా అవకాశాలు వస్తున్నాయని ఉద్దేశంతో సుడిగాలి సుదీర్ జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేశాడు. అంతే కానీ మరేదో కారణం కాదంటూ బుల్లి తెర వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటీ అనేది తెలియాల్సి ఉంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి