Home » Entertainment » Sudigali Sudheer Fans Tension About His Movies And Shows
Entertainment

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ లో ఆందోళన.. వాళ్లని చూసి నేర్చుకో అన్నా..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 17, 2022, 2:00 pm
Advertisement

Sudigali Sudheer : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్‌ గురించి అందరికి తెలిసిందే. బుల్లి తెర స్టార్‌ హీరో అంటూ ఆయనకు పేరు ఉంది. అంతటి గుర్తింపు ఖ్యాతి ఉన్న సుడిగాలి సుధీర్ ఇటీవలే జబర్దస్త్‌ కు గుడ్ బై చెప్పాడు. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ కి కూడా బై బై చెప్పేశాడు. సుడిగాలి సుధీర్ మరియు ఆయన టీమ్‌ మెంబర్స్ అంతా కూడా మెల్ల మెల్లగా జబర్దస్త్‌ కు గుడ్ బై చెప్పడంతో మొత్తం షో కు చీకటి అలుముకున్నట్లుగా ఉంది అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

బుల్లితెర పై ఎన్నో షో లతో అలరించిన సుడిగాలి సుధీర్ త్వరలో వెండితెరపై స్టార్‌ ను అవ్వాలని ఆశ పడుతున్నాడు. ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన సుధీర్ సక్సెస్ ను దక్కించుకోలేక పోయాడు. బుల్లి తెర నుండి వెళ్లిన వారు వెండి తెరపై మన తెలుగు వారు సక్సెస్ అయిన దాఖలాలు చాలా తక్కువ. కాని సుధీర్ మాత్రం చాలా నమ్మకంతో తాను సక్సెస్ అవుతాను.. స్టార్‌ ను అవుతాను అనే నమ్మకంతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. సుధీర్ చేస్తున్న సినిమాల సంఖ్య ప్రస్తుతం చాలా పెద్దదే. అందులో ఎన్ని సినిమాలు విడుదల అవుతాయి అనే క్లారిటీ కూడా లేదు. ఇష్టానుసారంగా కమిట్‌ అయ్యి సినిమాలు చేయడం వల్ల స్టార్‌ దక్కడం ఏమో కాని పరువు పోవడం ఖాయం అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Sudigali Sudheer fans tension about his movies and shows

Advertisement

సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ యొక్క ఆందోళన కూడా అదే. జబర్దస్త్‌ లో ఉన్నప్పుడు బయట ఎన్ని చేసినా కూడా జబర్దస్త్‌ వల్ల చాలా పాజిటివ్‌ గా ఆయనపై అభిప్రాయం ఉండేది. కాని ఇప్పుడు ఆ అభిప్రాయం మారే అవకాశం ఉంది. బుల్లి తెరకు వెండి తెరకు చాలా తేడా ఉండి. గతంలో వెండి తెరపై సందడి చేయాలని వెళ్లిన జబర్దస్త్‌ మాజీ టీమ్‌ లీడర్స్‌ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో అందరికి తెల్సిందే. వాళ్లను చూసి అయినా సుధీర్ జాగ్రత్త పడితే బాగుండు అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి సుడిగాలి సుధీర్ ప్లాన్ ఏంటీ.. బుల్లి తెరకు దూరం అవుతాడా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి