Sudigali Sudheer in etv mallemala latest special show
Sudigali Sudheer : జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ.. శ్రీదేవి డ్రామా కంపెనీ లో యాంకర్ గా మంచి పేరును దక్కించుకున్న సుడిగాలి సుధీర్ ఈటీవీ నుండి వెళ్లి పోయిన విషయం తెల్సిందే. స్టార్ మా కి వెళ్లిన సుడిగాలి సుధీర్ సినిమా ల్లో కూడా బిజీ అయ్యాడు. ఈటీవీలో ఉన్న సమయంలో సినిమా ల యొక్క షూటింగ్ కు హాజరు అవ్వడం కష్టంగా మారిందని.. అందుకే సినిమా ల్లో ఎక్కువ సమయం కేటాయించడం కోసమే తాను జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ లో చేయడం మానేస్తున్నాను అంటూ సుడిగాలి సుధీర్ ఆ మధ్య పలు సందర్బాల్లో చెప్పడం జరిగింది.
మళ్లీ ఈటీవీలో సుధీర్ కనిపించక పోవచ్చు అనుకుంటున్న సమయంలో వెళ్లి పోయిన అతి తక్కువ సమయంలోనే మళ్లీ ఈటీవీలో సుడిగాలి సుధీర్ ప్రత్యక్షం అయ్యాడు. ఈటీవీ వార్షికోత్సవం సందర్బంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం లో సుడిగాలి సుధీర్ మాత్రమే కాకుండా ఈటీవీ నుండి వెళ్లి పోయిన అనసూయ, చమ్మక్ చంద్ర ఇంకా పలువురు కూడా ఈ షో లో పాల్గొన్నారు. ఈ షో లో పాల్గొన్నందుకు గాను సుడిగాలి సుధీర్ పారితోషికం తీసుకోలేదు అంటూ టాక్ వినిపిస్తుంది. మల్లెమాల వారి నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఒక్క రోజు డేట్ ఇచ్చిన సుధీర్ అందుకు పారితోషికం అక్కర్లేదు అన్నాడట.
Sudigali Sudheer in etv mallemala latest special show
తనకు కెరీర్ ను ఇచ్చిన ఈటీవీ వార్షికోత్సవం లో పాల్గొనడం అనేది తన బాధ్య అని.. అందుకే తాను పారితోషికం తీసుకోక పోవడం తో పాటు గతంలో తనను అవమానించినా కూడా మళ్లీ ఈటీవీలో కనిపించేందుకు సుధీర్ ఓకే చెప్పి తన మంచి మనసును చాటుకున్నాడు అంటూ నెటిజన్స్ మరియు ఈటీవీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈటీవీలో సుడిగాలి సుధీర్ కంటిన్యూ అవుతాడా అంటే లేదు అనే సమాధానం వినిపిస్తుంది. ఈటీవీతో సన్నిహిత సంబంధాలు కొనసాగినా కూడా అప్పుడప్పుడు ఇలా ప్రత్యేక ఈవెంట్స్ కు వస్తాడేమో కానీ పూర్తి స్థాయి షోలకు వచ్చే ఆలోచన లేదని సుధీర్ అన్నాడట.
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
This website uses cookies.