Sudigali sudheer re entry in jabardasth
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కి బుల్లితెరపై ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.. అతను ఏ షోలో ఉన్నా ఆషో మంచి రేటింగ్ ని సొంతం చేసుకుంటుంది. సుధీర్ కు ఉండే ఫ్యాన్స్ ఫాలోయింగ్ అలాంటిది మరి. జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీమ్ చేసే హడావుడి అంతా ఇంతాకాదు. దాదాపు పదేళ్లుగా ఈ టీవీలో ప్రసారం అవుతన్న జబర్దస్ట్ షో టాప్ రేటింగ్ లో కొనసాగింది. కానీ.. ఇటీవల ఈ షో నుంచి అందరూ బయటకి వెళ్లిపోతుండటంతో రేటింగ్ లో వెనక్కి తగ్గింది. జబర్దస్త్ , ఎక్స్ స్ట్రా జబర్దస్త్ కి జడ్జిగా చేసిన నాగబాబు ముందుగా ఈ షోనుంచి తప్పుకుంటూ చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ, ధనరాజ్, వేణు లాంటి పాపులర్ కమెడియన్లను తీసుకుని వెళ్లారు. అయితే ఆ తర్వాత సుధీర్ గెటప్ శ్రీను, హైపర్ ఆది వంటి వారు రేటింగ్ తగ్గకుండా నెట్టుకొచ్చారు. ఆ తర్వాత రోజా కూడా మంత్రి పదవీ చేపట్టడంతో ఈ షోక గుడ్ బై చెప్పింది.
ఇక ఆ తర్వాత సుడిగాలి సుధీర్, గెటప్ శీను లాంటి పాపులర్ కమెడియన్లు కూడా జబర్దస్త్ నుంచి తప్పుకున్నారు. అయితే యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ నుంచి తప్పుకుందనే వార్తలు వినిపించాయి. సుధీర్‌తో కలసి స్టార్ మాలో సూపర్ సింగర్ జూనియర్ షో చేస్తుండటంతో జబర్దస్త్ నుంచి అనసూయ తప్పుకుంటుందనే వార్తలు వినిపించాయి. అలాగే హైపర్ ఆది కూడా అదే దారిలో వెళ్లిపోతాడని అన్నారు. ఇక అంతే కాకుండా ఇటీవల కిర్రాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలతో పెద్ద దుమారమే రేగింది. ప్రపంచంలో మల్లెమాల లాంటి వరస్ట్ ప్రొడక్షన్ ఉండదనే.. అందుకే తనతో పాటు.. సుధీర్, రష్మి, అనసూయ, హైపర్ ఆది, గెటప్ శీను ఇలా పాపులర్ సెలబ్రిటీలంతా అక్కడ నుంచి క్యూ కడుతున్నారంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ వ్యాఖ్యలపై ఆది, రామ్ ప్రసాద్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
Sudigali sudheer re entry in jabardasth
అయితే సుధీర్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రామానికి హోస్ట్ చేస్తుండగా ఏవో కారణాలతో స్టార్ మాలోకి వెళ్లి పోవడంతో ప్రస్తుతం యాంకర్ రష్మితోనే నడిపిస్తున్నారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో మల్లెమాల మళ్లీ అందరినీ తీసుకువచ్చే ప్లాన్ లో ఉందని అంటున్నారు. తాజా శ్రీ దేవీ డ్రామా కంపెనీ ప్రోమోలో రష్మి బయోగ్రఫీతో హైలైట్ చేయడం.. సుధీర్ పేరు వినిపించడం.. అక్కా బావెక్కడ అని రష్మీని అనడం చూస్తుంటే మళ్లీ సుధీర్ ని తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ప్రోమోలో జబర్దస్త్‌ని వీడబోతున్నారంటూ వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆది. ఓ ఇంటర్వ్యూలో కూడా క్లారిటీ ఇస్తూ సుధీర్ రెండు చోట్ల కుదరక వెళ్లిపోయాడని చెప్పుకొచ్చారు. ఈ ప్రోమోతో సుధీర్ పేరును వినిపించి మళ్లీ వస్తున్నాడన్నట్లు హింట్ ఇచ్చారు. మరి సుధీర్ ఎంట్రీ ఉంటుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే..
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంకి గట్టి బలం లభించబోతోంది.…
Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారంలోకి రావాలంటే, పాత తప్పులను పునరావృతం చేయకూడదని పలువురు అభిప్రాయపడుతున్నా, సజ్జల…
Mahesh Babu ED notices : సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఈడీ నోటీసులు అనే వార్త అభిమానులనే…
Tomato Juice To Regrow Hair : కాలంలో ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం. ఎన్నో…
Magic Leaf : ఇది వంటకాలలో ఎంతో సువాసనను కలిగి ఉంటుంది. ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పురుషులకు పవర్…
Glowing Skin : ఈ రోజుల్లో అందంగా కనిపించాలంటే మేకప్ లు తీసేయాల్సిందే. చర్మం కోసం తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైన…
Papaya Leaf : బొప్పాయ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. బొప్పాయ ఆకు కూడా అంతే మేలు చేస్తుంది.…
Shiva Puja Tips : పురాణాల ప్రకారం శివయ్య బోలా శంకరుడు అని అంటారు. ఆయనకు ఇంత కోపం వస్తుందో…
This website uses cookies.