Sudigali Sudheer Tries To Impress Krithi Shetty
Krithi Shetty : సుడిగాలి సుధీర్‌కు బుల్లితెరపై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతను ఎక్కడుంటే ఫన్ అక్కడే ఉంటుంది. సుధీర్ ఇప్పుడు స్టార్ మా సింగింగ్ షోకు వచ్చేశాడు. సూపర్ సింగర్స్ జూనియర్స్ షోలో అనసూయ, సుధీర్ కలిసి హోస్ట్ చేస్తున్నారు. ఈ షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఆదివారం జరిగింది. ఇందులో సుధీక్ష చివరకు విజేతగా నిలిచింది. సుధీక్ష గెలుస్తుందని అందరూ ముందే ఊహించేశారు. ఇక ఈ గ్రాండ్ ఈవెంట్‌లో ఎన్నో ఆసక్తికరమైన సన్నివేశాలు జరిగాయి. అందులో ఒకటి సుధీర్ కృతి శెట్టి ట్రాక్. ఇక సూపర్ సింగర్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ మరింత ఆకర్షణీయంగా నిర్వహించారు. బ్రహ్మానందం,నాగార్జున వంటి వారు గెస్టులుగా వచ్చారు.
కాగా ఈ గ్రాండ్ ఫినాలేకి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ టీం కృతి శెట్టి, సుధీర్ బాబు, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ప్రమోషన్స్‌లో భాగంగా వచ్చారు. వేదికపైకి వచ్చిన కృతి శెట్టిని సుడిగాలి సుధీర్ ఇంప్రెస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ వేదికపై పెళ్లి కానీ వాళ్ళు ఇద్దరే ఉన్నారు ఒకరు కృతి శెట్టి మరొకరు నేను అని సుదీర్ అన్నాడు. అంటే ఆమెకు లైన్ వేస్తున్నావా? అని అనసూయ వెంటనే సుడిగాలి సుధీర్‌ని అడిగింది. అసలు కృతి శెట్టికి ఎలాంటి అబ్బాయి కావాలో చెబితే బాగుంటుంది అని అడిగేసింది. కైండ్ హార్ట్, పాజిటివ్ యాటిట్యూడ్, సపోర్టివ్‌గా ఉండే హస్బెండ్ కావాలని కృతి చెప్పడంతో సుధీర్ పొంగిపోయాడు. ఈ లక్షణాన్నీ నాలో ఉన్నాయని సుధీర్ మళ్ళీ తనలోని కోరికలను బయట పెట్టేందుకు రెడీ అయ్యాడు.
Sudigali Sudheer Tries To Impress Krithi Shetty
ఇక ఇంతలో సుధీర్‌ను ఆడుకునేందుకు కృతి ఇంకో లక్షణం చెప్పింది. కొంచెం చబ్బీగా కూడా ఉండాలని కృతి అనగానే.. అవును నేను చాలా చబ్బీ కావాలంటే పొట్ట చూడండి అంటూ షర్ట్ బటన్ తీసి చూపించేశాడు. మరి ఇందాక సిక్స్ ప్యాక్ అన్నారు కదా? అని కృతి కౌంటర్ వేసింది. దాన్ని కూడా సుధీర్ కవర్ చేసేశాడు. సిక్స్ ప్యాక్ లో కూడా చబ్బీగా ఉండొచ్చని సుధీర్ సెటైర్లు వేశాడు. ఇలా మొత్తానికి కృతి శెట్టిని ఇంప్రెస్ చేసేందుకు సుధీర్ నానా తంటాలు పడ్డాడు. అసలే బేబమ్మ కోసం యూత్ అంతా కూడా పడి చచ్చిపోతోన్నారు. ఇక కృతితో సుధీర్ చేసిన ఈ ప్రయత్నం అందరినీ నవ్వించేసింది.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.