Home » Entertainment » Sukumar About Lavanya Tripathi In Chaavu Kaburu Challaga Pre Release Event
Entertainment

Sukumar : లావణ్య త్రిపాఠి పరువుదీసేశాడు.. సుకుమార్ మామూలోడు కాదు!

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: March 10, 2021 11:07 am
Advertisement

Sukumar : సుకుమార్ పెద్దగా సోషల్ మీడియాను ఫాలో అవ్వడు. ఆయన తన సినిమాలే లోకం అవుతుంటాయి. ఎప్పుడూ కూడా సినిమా పనుల్లోనే బిజీగా ఉంటాడు. అలాంటి సుకుమార్ ఈ మధ్య ట్రెండ్‌, ట్రోల్స్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. మొన్న ఏ1 ఎక్స్‌ప్రెస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి హీరో సందీప్ కిషన్‌ను అన్నా అనేసిన విషయం తెలిసిందే. ఆ ఘటన యూట్యూబ్‌లో తెగ వైరల్ అయింది. దాని మీద విపరీతమైన ట్రోలింగ్ నడిచింది.

Advertisement

Sukumar : లావణ్య త్రిపాఠి పరువుదీసేశాడు.. సుకుమార్

Sukumar About Lavanya Tripathi In Chaavu Kaburu Challaga Pre Release Event

అది సుకుమార్ చెవిలో కూడా పడినట్టు కనిపిస్తోంది. నిన్న చావు కబురు చల్లగా అనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దానికి సుకుమార్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ క్రమంలో మాట్లాడుతూ లావణ్య గురించి కామెంట్ చేశాడు, లావణ్య పేరును విడగొట్టి లాజిక్స్ కూడా తీసేశాడు. లావణ్య అంటూ లవ్ అన్నయ్య.. అంటూ అందుకే అందరినీ అన్నా అనేస్తోందేమో అని సుకుమార్ కౌంటర్ వేశాడు. దీంతో లావణ్య తెగ నవ్వేసింది.

Advertisement

మొత్తానికి పేరులోనే లాజిక్ తీసి సుకుమార్ లెక్కల మాస్టార్ అనిపించుకున్నాడు. ఇక చావు కబురు చల్లగా సినిమా గురించి మాట్లాడుతూ ఎంతో ఫిలాసఫీ ఉందని చెప్పుకొచ్చాడు. ఇది కచ్చితంగా విజయం సాధిస్తుందని, ఇందులో ఓ పాట రాసిన చిన్న వాడిని స్టేజ్ మీదకు పిలిచి మరీ అభినందించాడు. పైన పటారం అనే పాట ఓ చిన్న పిల్లవాడు రాశాడని తెలియడంతో షాక్ అయ్యానంటూ సుకుమార్ చెప్పుకొచ్చాడు. ఈ మూవీ మార్చి 11న రాబోతోంది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి