Home » Entertainment » Sukumar In Rangasthalam Sequel Plan Ram Charan As President
Entertainment

” రంగస్థలం ” సీక్వెల్ ప్లాన్ లో సుకుమార్ .. ప్రెసిడెంట్ గా రాం చరణ్ ..?

Authored By
vamana sai
The Telugu News | Published on: January 1, 2021, 12:16 pm
Advertisement

రంగస్థలం సినిమా టాలీవుడ్ లో ఎంత పెద్ద సంచలన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా – అక్కినేని సమంత హీరోయిన్ గా నటించింది. సుకుమార్ ఈ సినిమాని తెరకెక్కించాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన రంగస్థలం రాం చరణ్ తో పాటు సుకుమార్, సమంత ల కెరీర్ లో కూడా ఒక మైల్ స్టోన్ సినిమాగా నిలిచిపోతుందనడం లో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడు స్టైలిష్ చిత్రాలు తీసి సూపర్ హిట్స్ అందుకునే సుకుమార్ ఫస్ట్ టైం కల్ట్ కంటెంట్ తో రంగస్థలం సినిమా తీసి ఇండస్ట్రీలో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాడు.

Advertisement

రంగస్థలం చూసిన స్టార్ హీరోలందరూ సుకుమార్ ని ఏమడిగారో తెలుసా ..?

Advertisement

ఈ సినిమా చూసిన చాలామంది టాలీవుడ్ స్టార్ హీరోలు రంగస్థలం లాంటి కథ చెప్పమని సుకుమార్ ని కోరారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సుకుమార్ అల్లు అర్జున్ – రష్మిక మందన్న జంటగా పుష్ప అన్న పాన్ ఇండియన్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తెలుగు తో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా దర్శకుడిగా సుకుమార్ కి హీరోగా అల్లు అర్జున్ కి ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు సుకుమార్.

Advertisement

ఈ సినిమా కథ కూడా ఇలాంటి కల్ట్ కంటెంట్ తోనే తెరకెక్కబోతుందని చెప్పుకుంటున్నారు. కాగా ఇప్పుడు సుకుమార్ రంగస్థలం సినిమాకి సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో రాం చరణ్ ప్రెసిడెంట్ గా నటిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల ద్వారా వినిస్తోంది. ప్రెసిడెంట్ గా రాం చరణ్ పాత్ర చాలా హుందాగా ఉంటుందని.. ఈ సినిమా కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమాని రాం చరణ్ సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ లో నిర్మిస్తారని సమాచారం.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి