Ravi Teja Krack Movie Trailer Released
గోపీచంద్ మలినేని రవితేజ సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడి, కామెడీని ఎక్కడ ఎలా వాడాలో తెలిసిన డైరెక్టర్‌గా గోపీచంద్ మలినేనికి మంచి పేరుంది. డాన్ శీను, బలుపు వంటి హిట్ చిత్రాల తరువాత ఈ ఇద్దరి కాంబోలో వస్తోన్న చిత్రమంటే అందరికీ అంచనాలు భారీగా ఉంటాయి. వాటిని అందుకునేలానే ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ కూడా ఉంది. ఇక పాటలతో తమన్ ఇప్పటికే అదరగొట్టేశాడు.
ఇవన్నీ ఇలా ఉంటే న్యూ ఇయర్ కానుకగా క్రాక్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో వెంకటేష్ వాయిస్ ఓవర్ అడిషనల్‌గా అందరినీ ఆకట్టుకుంటోంది. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ అయిన వీర శంకర్‌ను పరిచయం చేస్తూ వెంకీ వేసిన సెటైర్లు, పంచ్‌లు బాగానే ఉన్నాయి. ఇక సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్‌లు ఈ సినిమా పెద్ద బలంగా మారేలా కనిపిస్తున్నారు. భయంకరమైన విలనిజాన్ని గోపిచంద్ మలినేని చూపించేందుకు రెడీ అయినట్టున్నాడు,
Ravi Teja Krack Movie Trailer Released
అంతే కాకుండా రవితేజలోని మాస్ యాంగిల్‌ను పూర్తిగా బయటకు తీసినట్టు కనిపిస్తోంది. చిన్న బ్రేక్ ఇచ్చా.. ఈ టైంలో ఎన్ని యాడ్స్ వేసుకుంటావో వేసుకో.. ఇంకాసేపు ఆగితే ఏది కోసేస్తానే నాకే తెలియదు.. అంటూ రవితేజ తన మ్యానరిజంలో కొట్టిన డైలాగ్‌లు బాగానే ఉన్నాయి. రక్తం తాగుతా అంటూ సముద్రఖని తన స్టైల్లో చెప్పిన డైలాగ్, వరలక్ష్మీ విలనిజాన్ని ఓ లెవెల్‌లో పండించారు. ఇక శ్రుతీ హాసన్ రవితేజల రొమాన్స్ కూడా ఫుల్ క్లిక్ అయ్యేలానే ఉంది. రవితేజ సంక్రాంతి బరిలోకి దిగి ఈసారి హిట్ కొట్టేలానే ఉన్నాడు.
Rakhi Festival : శ్రావణమాసం వస్తూనే పండుగల వాతావరణం వస్తుంది. మాసంలో అంతా కూడా ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది. 25వ…
Infections : వర్షాకాలం వచ్చిందంటే ఇన్ఫెక్షన్ లో పెరిగిపోతాయి. అయితే కొన్ని ప్రాణాంతకమైనవిగా ఉండవు. కానీ మరికొన్ని ప్రాణానికి ముప్పు…
Naga Panchami : శ్రావణమాసంలో నాగ పంచమి ఇది కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది.ఈ నాగ పంచమిని కూడా…
Nivita Manoj : hari hara veera mallu నాలుగు రోజుల క్రితం వరకూ నివేతా పేరు ప్రేక్షకులకు పెద్దగా…
Jadeja : మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన నాలుగో టెస్టును టీమిండియా డ్రాగా ముగించింది. తొలి నాలుగు రోజుల…
Wife : “పెళ్లికి ముందే ఓసారి ప్రశ్నించండి.. నా తప్పును మీరు చేయోద్దు” అంటూ ఓ యువకుడు మీడియా ముందు…
Unemployed : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వరుస తీపి కబుర్లు అందజేస్తూ…
Indiramma House : ఇందిరమ్మ ఇళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం…
This website uses cookies.