Suman Comments : సిగరెట్, మందు కోసం రజనీకాంత్ మూటలు మోశాడంటూ స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్...
Suman Comments : సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.ఆయనకి దేశ వ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన స్టైల్‌కి, నడకకి అభిమానులు మైమరచిపోతుంటారు. ఈ వయస్సులోను ఎంతో ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు తలైవా. అయితే కొద్ది రోజులుగా రజనీకాంత్ 171 మూవీకి సంబంధించి అనేక ప్రచారాలు జరుగుతుండగా, ఎట్టకేలకి ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్ బయటకు వచ్చింది. రజనీకాంత్ -లోకేష్ చిత్రానికి సంబంధించి తన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను పోస్టు చేస్తూ ఏప్రిల్ 22న టైటిల్ రివీల్ చేసయనున్నట్టు తెలియజేశారు దర్శకుడు. ఈ సినిమాతో రజనీకాంత్ తన ఖాతాలో మరో సూపర్ హిట్ వేసుకోవడంఖాయంగా చెబుతున్నారు.
అయితే రజనీకాంత్ ఈ స్థాయికి చేరుకోవడం వెనక చాలా కష్టం ఉంది. సీనియర్ నటుడు సుమన్ ఓ ఇంటర్వ్యూలో రజినీకాంత్ వ్యక్తిత్వం, ఎలా ఉండేవారు అని చెప్పారు. రజనీకాంత్‌తో నాకు మంచి అనుబంధం ఉండేది. 1979లో మేమిద్దరం కలిసి అన్నదమ్ముల పాత్రల్లో చేశాం. అప్పటి నుంచి మా మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. రజనీకాంత్ స్టార్‌గా ఉన్న సమయంలో నా కోసం న్యాయం మీరే చేయాలి అనే నా సినిమాలో ర గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి సందడి చేశారు. ఇక ఆయన నటించిన శివాజి సినిమాలో నేను విలన్‌గా చేశాను. రజనీకాంత్ అంటే నాకు ఎప్పటికీ ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఆయనకు మందు తాగే అలవాటు ఉంది. ఆయన తాగేటప్పుడు నన్ను పిలుస్తారు.
అయితే ఆయన మందు తాగుకుంటూ నాకు కోక్ పోస్తారు. అదేంటని అడిగితే నా శరీరం నేను నాశనం చేసుకుంటాను. కాని నీ శరీరం పాడుచేసే నాకు హక్కు లేదని అంటారు. ఇక శివాజి సినిమా షూటింగ్ సమయంలో ఒక క్లైమాక్స్ షూట్ ఎంఎస్ రామయ్య కాలేజ్ లో చేస్తున్నాం.అప్పుడు రజినీకాంత్ నన్ను బిల్డింగ్ మీదకు తీసుకెళ్లి దూరంగా ఉన్న ఒక షాప్ చూపించారు. అక్కడ మూటలు మోసానని తెలిపారు. కండక్టర్ గా చేసిన తర్వాత రాత్రి మూటలు మోసే వాడిని. నా సిగిరెట్లు, మందు ఖర్చుల కోసం ఇలా చేసేవాడిని అని ఆయన నాకు చెప్పుకొచ్చారు. ఆయన ఎంత మందికి సాయం చేసిన ఎప్పుడు కూడా గొప్పలకి పోలేదు. కల్యాణమండపానికి పిలిచి పెళ్లిళ్లు చేసేవాళ్లు. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అస్సలు లేదు. శివాజీ సినిమాలో నేను ఏదైనా సీన్ లో బాగా చేస్తే.. సుమన్ తినేశావయ్యా.. నాకన్నా బాగా చేశావ్ అని పొగిడేస్తారు అంటూ రజనీకాంత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సుమన్.
UPI New Service : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. భారతదేశంలో…
Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు…
Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
Liquor : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…
GST : జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చదవాల్సిందే. 2025 జులై పన్ను కాలం…
Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
This website uses cookies.