superstar krishna clash between sp balu
Krishna సూపర్ స్టార్ కృష్ణ హీరోగా మంచి ఫాంలో ఉన్న రోజులవి. ఆ టైంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ప్లే బ్యాక్ సింగర్, సింగర్‌గా తన కెరీర్ మంచిగా సాగుతోంది. సూపర్ స్టార్ సినిమాలన్నింటికీ దాదాపు ఎస్పీ బాలునే గాయకుడిగా పనిచేశారు. ఉన్నట్టుండి ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. కృష్ణగారు ఎస్పీబీకి కాల్ చేసి ఏదో అన్నారట. దీంతో బాలు చాలా ఫీల్ అయ్యారని తెలిసింది.
ఆ తర్వాత కృష్ణ గారు తన సినిమాలకు బాలు స్థానంలో వేరే గాయకుడితో పాటలు పాడించకున్నారట.. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..సూపర్‌స్టార్ కృష్ణ కేవలం ఒక తెలుగు చిత్ర పరిశ్రమకే చెందిన వారు కాదు. సౌతిండియాతో పాటు దేశమొత్తం ఆయన సినిమాలకు ఫ్యాన్స్ ఉండేవారు. భారత చలన చిత్రరంగం గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా పేరు సంపాదించకున్నారు. ఈయనతో పాటు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కూడా దేశంలో అన్ని సినిమా ఇండస్ట్రీలతో కలిసి పనిచేశారు.
superstar krishna clash between sp balu
తన కెరీర్‌లో దాదాపు యాభై వేలకు పైగా పాటలు పాడి ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. బాలు గారు ప్రస్తుతం మన మధ్య లేకపోయినా ఆయన గాత్రం వింటే ఇప్పటికీ ఆయన మన మధ్యలోనే ఉన్నారని అనిపిస్తుంది.అయితే, ఎస్పీ బాలు, సూపర్ స్టార్ కృష్ణ గారికి మధ్య ఎందుకు గ్యాప్ వచ్చిందనే విషయాన్ని ‘పద్మాలయ శర్మ’ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గురించి ‘వింధ్యా కృష్ణ’ బ్యానర్లో ఓ బుర్ర కథ చేయగా.. దానికి ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారు ప్లే బ్యాక్ ఇచ్చారట. సూపర్ స్టార్ దంపతులకు ఆనాడు కాంగ్రెస్ పార్టీపై ఎంతో అభిమానం ఉండేదట. ఈ బుర్రకథ ప్రొగ్రామ్‌కు ఎస్పీబీకి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ విషయంలో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని తెలిపారు శర్మ. అప్పట్లో పేమెంట్స్ ప్రాసెస్ చాలా నెమ్మదిగా ఉండేదని తెలిసింది.
దీంతో కృష్ణ గారికి కోపం వచ్చి బాలు స్థానంలో రాజ్ సీతారాంతో పాడించడం మొదలెట్టారట..ఇక ఓ సారి సూపర్ స్టార్ కృష్ణగారు తనకు కాల్ చేసి మీరు పాటలు పాడకపోతే నా సినిమాలు ఆడవా..? అని సీరియస్‌గా మాట్లాడినట్టు ఎస్పీబీ ఒకానొక సందర్భంలో క్లారిటీ ఇచ్చారు.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.