Home » Entertainment » Superstar Krishna In Hospital With Serious Illness
Entertainment

Big Breaking : తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్ లో సూపర్ స్టార్ కృష్ణ..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: November 14, 2022 11:07 am
Advertisement

Big Breaking: ఈరోజు ఉదయం సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర స్వస్థతకు గురయ్యారు. దీంతో హటాహుటిన కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. ఈ క్రమంలో కృష్ణకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Advertisement

ఈ ఏడాది ప్రారంభంలో పెద్ద కొడుకు రమేష్ బాబు మరణించడం తర్వాత భార్య ఇందిరాదేవి కూడా కన్నుమూయడంతో కృష్ణ కృంగిపోయారు. అప్పటినుండి ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలం నుండి కృష్ణ సినిమాలకు దూరంగా ఉన్నారు. బయట వేడుకలకు కూడా హాజరు కావడం లేదు. అయితే ఈ ఏడాది వరుసగా కుటుంబంలో ఇద్దరు మరణించడంతో ఎంతో వేదన చెందడం జరిగింది.

superstar krishna in hospital with serious illness

Advertisement

దీంతో కృష్ణా అనారోగ్యానికి గురైనట్లు ఈరోజు ఉదయం మరి సీరియస్ కావడంతో.. కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో జాయిన్ చేశారు. వైద్యులు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వార్త తెలుసుకొని సూపర్ స్టార్ ఫ్యాన్స్ కృష్ణ త్వరగా కోలుకోవాలని భగవంతునికి ప్రార్ధనలు చేస్తున్నారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి