Home » Entertainment » Supritha Fires On Are You A Question
Entertainment

ఆర్ యూ వర్జిన్.. నెటిజన్ ప్రశ్నకు సురేఖా వాణి కూతురు సుప్రిత షాక్..!

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: May 25, 2021, 11:22 am
Advertisement

Supritha నటి సురేఖా వాణి కూతురు సుప్రిత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. సుప్రిత చేసే అందాల ఆరబోత, రీల్ వీడియోలు, డ్యాన్సులు అన్నీ కూడా నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. ఇక వీకెండ్స్ వస్తే పార్టీలు, పబ్‌లు అంటూ తెగ రచ్చ చేస్తుంటారు. అలాంటి సుప్రితకు సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లు, ట్రోలింగ్ ఎక్కువగా వస్తుంటాయి. అయితే వాటికి తన దైన శైలిలో స్పందిస్తుంటుంది. తాజాగా సుప్రితకు అనుకోని ప్రశ్న ఎదురైంది.

Advertisement

Supritha

సుప్రిత తాజాగా సోషల్ మీడియాలో తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టారు. ఈ క్రమంలో సుప్రిత అనేక రకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. లాక్డౌన్‌లో ఏం చేస్తున్నావ్? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? సినిమాల్లోకి వస్తావా? అంటూ ఇలా రొటీన్ ప్రశ్నలు సంధించారు. అయితే కొందరు ఆకతాయిలు మాత్రం కాస్త హద్దులు దాటారు. బీర్ తాగుతావా? వైన్ తాగుతావా? అని ప్రశ్నించారు. ఏం మాట్లాడుతున్నారు అంటూ సుప్రిత ఫైర్ అయ్యారు.

Advertisement

ఇక మరో నెటిజన్ మరింత ముందుకు వచ్చి వర్జినిటీ గురించి అడిగేశాడు. ఆర్ యూ వర్జిన్ అంటూ వకీల్ సాబ్ సినిమా టైపులో అడిగేశాడు. దానికి సుప్రిత సైతం వకీల్ సాబ్ కోర్ట్ సీన్ వీడియోను షేర్ చేశారు. అబ్జెక్షన్ అంటూ పవన్ కళ్యాణ్ ఊగిపోయే సీన్‌ను షేర్ చేశారు. అలా ఆ ప్రశ్నకు తాను హర్ట్ అయ్యానంటూ చెప్పకనే చెప్పేశారు. పవన్ కళ్యాణ్ ఆ టేబుల్ ఎత్తి పడేసినట్టుగా సుప్రితకు కూడా అంత కోపం వచ్చినట్టుందని తెలుస్తోంది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి