Surekha vani : వార్నీ.. సురేఖ వాణి కూతురు తల్లిని మించిపోయిందే? నడుము చూపిస్తూ ఆ డ్యాన్స్ ఏంది.. వైర‌ల్ వీడియో

 Authored By jagadesh | The Telugu News | Updated on :17 May 2021,10:58 am

Surekha vani : నటి సురేఖ వాణి తెలుసు కదా. తను టాలీవుడ్ నటి అయినప్పటికీ.. అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నప్పటికీ తను తెలుగు ప్రేక్షకులకే కాదు.. సోషల్ మీడియా అభిమానులకు కూడా ఎక్కువగా పరిచయం అయింది. దానికి కారణం.. సోషల్ మీడియాలో తను ఎక్కువగా యాక్టివ్ గా ఉండటమే. సురేఖ వాణి సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ లో ఉంటుంది. అప్పుడప్పుడు తన డ్యాన్స్ వీడియోలు, ఇతర పర్సనల్ వీడియోలను పోస్ట్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది.ఇక.. తనకు ఒక కూతురు కూడా ఉంది. తన కూతురు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన కూతురు సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇప్పటికే చాలాసార్లు.. సోషల్ మీడియాలో చాలా వీడియోలు పెట్టి.. తన కూతురు ట్రెండింగ్ టాపిక్ గా మారింది. ఇద్దరూ కలిసి కూడా చాలా వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

tollywood actress surekha vani dance with her daughter

tollywood actress surekha vani dance with her daughter

Surekha vani : కూతురుతో కలిసి డ్యాన్స్ వేసి అదరగొట్టిన సురేఖ వాణి

తాజాగా.. సురేఖ వాణి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. తను, తన కూతురు ఇద్దరూ కలిసి రంగురంగుల చీరలు కట్టి.. జంపింగే అనే పాటకు డ్యాన్స్ వేసి అదరగొట్టారు. ఇద్దరి కాంబో కూడా సూపర్బ్. ఇద్దరూ తమ నడుమును చూపిస్తూ చేసిన డ్యాన్స్ అయితే మామూలుగా లేదు. తన కూతురును ఇండస్ట్రీకి పరిచయం చేయడం కోసం సురేఖ వాణి బాగానే ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పలువురు నిర్మాతలు, దర్శకులను తన కూతురును ఇండస్ట్రీకి పరిచయం చేయాలని కోరిందట. అలాగే.. సోషల్ మీడియాలో తన కూతురు కూడా బాగానే వీడియోలు చేస్తూ అందరి కంట పడుతోంది. అలాగే.. ఎవరైనా డైరెక్టర్ తన వీడియోలు చూసి నచ్చి ఏదైనా సినిమాలోకి తీసుకుంటారని ఆశ కావచ్చు. ఏది ఏమైనా.. సురేఖ వాణి, తన కూతురు మామూలోల్లు కాదు.. సోషల్ మీడియాను రచ్చ చేస్తున్నారు.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి