Surekha Vani : తెలుగు సినిమా పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. వీరిలో ఒకరిద్దరు మాత్రమే మంచి పేరు సంపాదించుకున్నారు. ఒకప్పుడు ఎటువంటి రోల్ అయినా చేయగల సామర్థ్యం ఉన్న నటి సుధ ప్రస్తుతం కనిపించకుండా పోయారు. ఆమె స్థానంలో ప్రస్తుతం సురేఖవాణి, పవిత్ర, హేమ, ప్రగతి వంటి నటీమణుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిందరిలో కాస్త యంగ్ అండ్ టాలెంటెడ్ రోల్స్ చేసేది మాత్రం సురేఖవాణి అని చెప్పవచ్చు. సురేఖవాణి ఇప్పటివరకు చాలా సినిమాలు చేసింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాకుండా స్టార్ కమెడియన్ భార్యగాను ఈవిడ మంచి రోల్స్ చేసింది.
బాద్ షా సినిమాలో బ్రహ్మానందం భార్యగా సురేఖవాణి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ నటి తాజాగా సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. దీనికి అనేక కారణాలున్నాయట.. ఇటీవల ఈ నటి తన కూతురితో కలిసి ఫోటో షూట్స్ ఎక్కువగా చేసి సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ పొందింది. కొందరు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తన కూతురితో కలిసి సమాధానాలు ఇచ్చే సురేఖ.. పిచ్చిపిచ్చి ప్రశ్నలు వేసే వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. వీరిద్దరూ చూసేందుకు తల్లికూతుర్ల కంటే మంచి ఫ్రెండ్స్‌లాగా కనిపిస్తుంటారు. పేరెంట్ చైల్డ్ అన్న బంధం ఏ కోశాన కనిపించదు. అయితే, సురేఖ వాణి నోటిదూల కారణంగానే ఆమెకు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయని టాక్ వస్తోంది. తాజాగా ఈ నటి స్వాతిముత్యం సినిమాలో అలరించింది.
ఈసినిమాలో నిర్మాత బెల్లంకొండ సురేశ్ చిన్నకొడుకు బెల్లంకొండ గణేశ్ హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు.ఇందులో హీరోయిన్ తల్లిగా సురేఖ వాణి నటించింది. ఇందులో ఆమె పాత్రకు మంచి గుర్తింపు దక్కింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ’నన్ను మంచి సినిమాలు చేయాలని చాలా మంది అడుగుతున్నారు. కానీ చేయాలంటే ముందు అవకాశాలు రావాలి కదా.. ఒక్కసారిగా నాకు అవకాశాలు ఎందుకు రావడం లేదో నాకే అర్థంకావడం లేదు. స్వాతిముత్యం సినిమా కోసం దర్శకుడు నా దగ్గరకు వచ్చినప్పుడు ముందు ఈ రోల్ కోసం నా దగ్గరికే వచ్చావా? అని అడిగాను’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఒక్క మాటలతో ఆమెను ఇండస్ట్రీలో ఎవరో తొక్కాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పకనే చెప్పిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.