Home » Entertainment » Surekha Vani Interest To Second Marriage
Entertainment

Surekha Vani : తోడు కావాలి అని సురేఖావాణి ఫీల్ అవుతున్నారా ?

Authored By
aruna
The Telugu News | Updated on: May 30, 2023 1:19 pm
Advertisement

Surekha Vani : తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది నటి సురేఖ వాణి. ఇక ఇప్పుడు సురేఖ వాణికి అవకాశాలు అంతగా రావడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. తాజాగా సురేఖ వాణి రిలీజ్ చేసిన వీడియో సంచలనం సృష్టించింది. ఆమె భర్త సురేష్ తేజ 2019 లో మరణించారు. ఆయన దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడతూ మరణించారట. దీంతో సురేఖ వాణి ఒంటరి అయిపోయారు. కూతురి సుప్రియ తో పాటు సింగిల్ లైఫ్ నీ లీడ్ చేస్తున్నారు. ఇక వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఆ మధ్య సురేఖ వాణి రెండో పెళ్లి గురించి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలను కూతురు సుప్రీత ఖండించింది.

Advertisement

Surekha Vani interest to second marriage

తప్పుడు వార్తలు రాయకండి అంటూ మీడియా మీద ఫైర్ అయ్యింది. అప్పుడప్పుడు సురేఖ వాణి కొన్ని బోల్డ్ కామెంట్స్ చేశారు. పెళ్లి సంగతి ఏమో కానీ బాగా డబ్బున్న అందగాడు దొరికితే చక్కగా సెటిల్ అయిపోతానని కామెంట్ చేశారు. తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ లో ఓ రీల్ చేసింది. ముసలోళ్లకు కూడా పెళ్లిళ్లు అవుతున్నాయి నాకు కావడం లేదని ఆ వీడియోలో ఆవేదన చెందింది. అయితే ఈ వీడియో ఫన్ కోసం చేసినా, తోడు లేక సురేఖ వాణి అల్లాడిపోతుందని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే నరేష్ మీద ఆమె ఇనత డైరెక్టుగా సెటైర్ వేశారని కొందరు అంటున్నారు. ఇటీవల నరేష్ పవిత్ర నటించిన మళ్లీ పెళ్లి సినిమా వారి బంధం మీద సురేఖ వాణి పరోక్షంగా కామెంట్స్ చేశారు అంటున్నారు.

Advertisement

ఆమె ఉద్దేశం ఏదైనా కానీ సురేఖ వాణి కామెంట్ లు వైరల్ అవుతున్నాయి. ఇటీవల సురేఖ వాణికి ఆఫర్స్ తగ్గాయి. నన్ను పరిశ్రమ పక్కన పెట్టిందని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఏంటి నటించడం లేదని అందరూ అడుగుతున్నారు అవకాశాలు ఇస్తే ఎందుకు నటించను ఆఫర్స్ ఇవ్వడమే కరువైపోయిందని ఆమె అన్నారు. మరోవైపు కూతురు సుప్రీతను హీరోయిన్ చేసే ప్లాన్ లో ఉన్నారు. సోషల్ మీడియా కారణంగా సుప్రీత ఆల్రెడీ సెలబ్రిటీ అయిపోయింది. కూతురు హీరోయిన్గా సక్సెస్ అయితే చూడాలని సురేఖ కోరుకుంటుంది. మరీ ఆమె ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి. ఇక వీరిద్దరికి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో బుల్లితెరపై పలు షోలలో కూడా కనిపిస్తూ సందడి చేస్తున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి