Home » Entertainment » Surekha Vani Shares Father Problems
Entertainment

Surekha Vani : ప్రతీ తల్లిదండ్రుల సమస్య ఇదే.. సుప్రిత గుట్టువిప్పిన సురేఖా వాణి

Authored By
Sam C
The Telugu News | Published on: March 11, 2022, 10:00 pm
Advertisement

Surekha Vani: పేరుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ సంపాదించుకుంది సురేఖా వాణి. చాలా సినిమాల‌లో న‌టించిన సురేఖా వాణి కొంత కాలంగా వెండితెర‌పై క‌నిపించ‌డం లేదు. సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్‌ని అమాంతం పెంచేసుకుంటూ ఆన్ లైన్ వేదికలపై రచ్చ రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ తన కూతురు సుప్రితను కూడా సెలబ్రిటీ చేసేసింది సురేఖ. సినిమాలేవీ చేయకపోయినా సుప్రితను అనుసరించే వారి సంఖ్య చాలా ఎక్కువ. ఇక ఈ తల్లీకూతుళ్ళ డాన్స్ పర్‌ఫార్‌మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనే లేదు. వీరిద్ద‌రు క‌లిసి అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా తెగ ర‌చ్చ చేస్తుంటారు.

Advertisement

సురేఖా వాణి సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. త‌న ప‌ర్స‌న‌ల్, ప్రొఫెష‌న‌ల్ విష‌యాలు షేర్ చేస్తూ అల‌రిస్తుంటుంది. అయితే త‌న సినిమాలో ఓక్లిప్‌ని తాజాగా షేర్ చేసిన ఈ అమ్మ‌డు ప్రతి తండ్రి ఇలాంటి బాధ‌లే ప‌డుతుంటార‌ని తెలిపింది. క్లిప్‌లో తండ్రి ఆయ‌న త‌న‌యుడిని పొద్దున లేస్తే బాగుంటుంద‌ని కోప‌గించుకుంటాడు. సురేఖా వాణి షేర్ చేసిన ఈ పోస్ట్‌పై నెటిజ‌న్స్ నుండి భిన్న‌మైన రెస్పాన్స్ వ‌స్తుంది. అంతేకాక ఈ పోస్ట్ వైర‌ల్‌గా కూడా మారింది.సుప్రిత కంటే సురేఖా వాణి అందంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుంటారు. తమ మీద వచ్చే ఫన్నీ మీమ్స్‌ను చూసి సుప్రిత, సురేఖా వాణి నవ్వుకుంటూ ఉంటారు.

surekha vani shares father problems

Advertisement

Surekha Vani : సురేఖా పోస్ట్ వైర‌ల్…

ఇక నెగెటివ్ కామెంట్లు, ట్రోలింగ్ మీద అయితే సురేఖా వాణి, సుప్రిత ఇద్దరూ విరుచుకుపడుతుంటారు. తన రెండో పెళ్లి మీద వచ్చిన రూమర్ల మీద సురేఖా వాణి ఎలా మండి పడిందో అందరికీ తెలిసిందే. రీసెంట్‌గా సురేఖా వాణి మరోసారి అసహనం వ్యక్తం చేసింది. తన పేరుతో నకిలీ ఖాతాలను నడుపుతుండటంతో ఫైర్ అయింది. తనకు ఎఫ్ బీ, ట్విట్టర్‌లో ఖాతాలు లేవని ఇది వరకే తాను ఎన్నో సార్లు క్లారిటీగా చెప్పాను అని మళ్లీ చెబుతున్నాను అంటూ సురేఖా వాణి తన ఇన్ స్టా స్టోరీలో పంచుకుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి