Swetha basu : శ్వేతా బసు టాలీవుడ్ కు పెద్దగా పరిచయం చేయనవసరం లేని పేరనే చెప్పాలి. చేసింది కొన్ని సినిమాల్లోనే అయినా కాంట్రవర్సీలతో అమ్మడు సోషల్ మీడియా లో పెద్దగానే పాపులర్ అయ్యింది. కొత్త బంగారు లోకం సినిమా హిట్ తరువాత శ్వేతా బసు కు టాలీవుడ్ లో పెద్దగా సినిమా అవకాశాలు లభించలేదు . ఆ సమయం లోనే పలు వివాదాల్లో చిక్కుకుని రకరకాలగా ఇబ్బందులు పడింది ఈ ముద్దుగుమ్మ . 2014 లో సెక్స్ రాకెట్ లో శ్వేత పట్టుబడటం ఆ తరువాత నిర్దోషి అని తేలడం తో అమ్మడి లైఫ్ ఒక్కసారిగా తారుమారు అయ్యింది. ఇక తెలుగు ఇండస్ట్రీ కి రామ్ రామ్ చెప్పేసే పరిస్థితి వచ్చింది . కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ బాటపట్టింది.
swetha-basu-what-she-is-speaking-happy-regarding-her-divorce
ఇక సినిమా అవకాశాలూ ఎలాగూ లేకపోవడం తో శ్వేత 2018 లో బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్ ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. అంత బాగుంది అనుకునేలోపే మరో బాంబు పేల్చింది శ్వేత బసు . పెళ్లైన ఏడాదిలోనే భర్తకు విడాకులు ఇచ్చేసింది. ఇదంతా పాత విషయమే, కానీ ప్రస్తుతం తన వైవాహిక జీవితం , విడాకుల పైన శ్వేత లేటెస్ట్ గా స్పందించింది . తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయామని శ్వేత చెబుతోంది . దానికి విడాకులు అని పేరు పెట్టాల్సిన పనిలేదని అంటోంది. ఇది ఒక బ్రేకప్ లా జరిగిందని చెప్పుకువస్తోంది .
పెళ్లైన చాలా సంవత్సరాలకి కూడా విడాకులు తీసుకునే వారు చాలా మందే ఉన్నారని. కానీ మేము సంవత్సరం లోనే విడిపోయాం కాబట్టి దీన్ని బ్రేక్ అప్ అని అంటే బాగుంటుందని చెప్పుకొస్తోంది శ్వేత బసు . రోహిత్ తో విడిపోయిన తర్వాత నా కుటుంబ సభ్యులు , స్నేహితులు తనపై ఎంతగానో ప్రేమను చూపించారంటోంది శ్వేత. ప్రజంట్ నాకు నేనే ఓ బెస్ట్ ఫ్రెండ్ గా మారానని చెబుతోంది. ఇప్పుడు లైఫ్ అంతా బాగుందని తాజాగా ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. శ్వేత ట్వీట్ చుసిన వారంతా అసలు శ్వేతా బసు ఏం మాట్లాడుతోంది? పెళ్ళి పెటాకులైతే అంత హాయిగా ఉందా..? అని ఆశ్చర్యపోతున్నారు. ఏదిఏమైనా ఇప్పటికైనా తన లైఫ్ బాగుండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.