Swetha basu : శ్వేతా బసు ఏం మాట్లాడుతోంది .. పెళ్ళి పెటాకులైతే అంత హాయిగా ఉందా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Swetha basu : శ్వేతా బసు ఏం మాట్లాడుతోంది .. పెళ్ళి పెటాకులైతే అంత హాయిగా ఉందా..?

 Authored By govind | The Telugu News | Updated on :5 February 2021,8:00 am

Swetha basu : శ్వేతా బసు టాలీవుడ్ కు పెద్దగా పరిచయం చేయనవసరం లేని పేరనే చెప్పాలి. చేసింది కొన్ని సినిమాల్లోనే అయినా కాంట్రవర్సీలతో అమ్మడు సోషల్ మీడియా లో పెద్దగానే పాపులర్ అయ్యింది. కొత్త బంగారు లోకం సినిమా హిట్ తరువాత శ్వేతా బసు కు టాలీవుడ్ లో పెద్దగా సినిమా అవకాశాలు లభించలేదు . ఆ సమయం లోనే పలు వివాదాల్లో చిక్కుకుని రకరకాలగా ఇబ్బందులు పడింది ఈ ముద్దుగుమ్మ . 2014 లో సెక్స్ రాకెట్ లో శ్వేత పట్టుబడటం ఆ తరువాత నిర్దోషి అని తేలడం తో అమ్మడి లైఫ్ ఒక్కసారిగా తారుమారు అయ్యింది. ఇక తెలుగు ఇండస్ట్రీ కి రామ్ రామ్ చెప్పేసే పరిస్థితి వచ్చింది . కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ బాటపట్టింది.

swetha basu what she is speaking happy regarding her divorce

swetha-basu-what-she-is-speaking-happy-regarding-her-divorce

ఇక సినిమా అవకాశాలూ ఎలాగూ లేకపోవడం తో శ్వేత 2018 లో బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్ ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. అంత బాగుంది అనుకునేలోపే మరో బాంబు పేల్చింది శ్వేత బసు . పెళ్లైన ఏడాదిలోనే భర్తకు విడాకులు ఇచ్చేసింది. ఇదంతా పాత విషయమే, కానీ ప్రస్తుతం తన వైవాహిక జీవితం , విడాకుల పైన శ్వేత లేటెస్ట్ గా స్పందించింది . తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయామని శ్వేత చెబుతోంది . దానికి విడాకులు అని పేరు పెట్టాల్సిన పనిలేదని అంటోంది. ఇది ఒక బ్రేకప్ లా జరిగిందని చెప్పుకువస్తోంది .

Swetha basu : మేము సంవత్సరం లోనే విడిపోయాం కాబట్టి దీన్ని బ్రేకప్ అనుకోండి..!

పెళ్లైన చాలా సంవత్సరాలకి కూడా విడాకులు తీసుకునే వారు చాలా మందే ఉన్నారని. కానీ మేము సంవత్సరం లోనే విడిపోయాం కాబట్టి దీన్ని బ్రేక్ అప్ అని అంటే బాగుంటుందని చెప్పుకొస్తోంది శ్వేత బసు . రోహిత్ తో విడిపోయిన తర్వాత నా కుటుంబ సభ్యులు , స్నేహితులు తనపై ఎంతగానో ప్రేమను చూపించారంటోంది శ్వేత. ప్రజంట్ నాకు నేనే ఓ బెస్ట్ ఫ్రెండ్ గా మారానని చెబుతోంది. ఇప్పుడు లైఫ్ అంతా బాగుందని తాజాగా ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. శ్వేత ట్వీట్ చుసిన వారంతా అసలు శ్వేతా బసు ఏం మాట్లాడుతోంది? పెళ్ళి పెటాకులైతే అంత హాయిగా ఉందా..? అని ఆశ్చర్యపోతున్నారు. ఏదిఏమైనా ఇప్పటికైనా తన లైఫ్ బాగుండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది