Home » Entertainment » Tamannaah Bhatia Satires On Suma In Cash 200th Episode Promo
Entertainment

Tamannaah : సుమ పరువుపాయే.. తమన్నా దెబ్బకు యాంకరమ్మ షాక్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: May 10, 2022, 7:30 pm
Advertisement

Tamannaah : యాంకర్ సుమ ఎప్పుడూ యాక్టివ్‌‌గానే ఉంటుంది. తనకు సినిమాల పట్ల విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే ప్రతీ సినిమా ఈవెంట్లో సుమ కనిపిస్తుంటుంది. సుమ ప్రతీ హీరో ఫంక్షన్‌కు వెళ్లాల్సి వస్తుంది. ఇక ఇతర షోలు, ఈవెంట్లలోనూ సినిమా ప్రస్థావనలు వస్తుంటాయి. అయితే తాజాగా సుమ మాత్రం పప్పులో కాలేసింది. ఒక హీరోయిన్‌ను పొగడబోయి బోల్తా కొట్టేసింది.సుమ క్యాష్ షోకు ఎఫ్ 3 టీం గెస్టుగా వచ్చింది.

Advertisement

ఇందులో సునీల్, సోనాల్ చౌహాన్, తమన్నా, అనిల్ రావిపూడి వంటి వారు వచ్చారు. క్యాష్ రెండు వందల ఎపిసోడ్ కావడంతో దీన్ని కాస్త స్పెషల్‌గా డిజైన్ చేశారు. ఇందులోనే సుమ బ్లండర్ మిస్టేక్ చేసింది. తమన్నా డ్యాన్సులను పొగుడుదామని చూసి తన తెలివిని ప్రదర్శించి అందరి ముందు అబాసు పాలైంది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.డాంగ్ డాంగ్ అనే ఈ పాటలో తమన్నా చిందులు వేసింది. తమన్నాతో పాటు మహేష్ బాబు సైతం స్టెప్పులు వేశాడు.

Tamannaah Satires On Suma In Cash 200th Episode promo

Advertisement

అయితే సుమకు ఆ విషయం సరిగ్గా గుర్తు లేనట్టుంది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో తమన్నా డ్యాన్స్ వేసిందని మాత్రమే గుర్తున్నట్టుంది. అయితే మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ పాట అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో మ్యూజిక్ వస్తుండగా.. సుమ కూడా ఆ స్టెప్పులు వేసింది.ఈ పాటలో తమన్నా అదిరిపోయిందంటూ చెప్పుకొచ్చింది సుమ. ఇంతలో తమన్నా ఆమె గాలి తీసేసింది. ఆ పాటలో రష్మిక ఉంటుంది.. అది రష్మిక పాట అని సుమకు పంచ్ వేస్తుంది తమన్నా. దీంతో సుమ తెల్లమొహం వేస్తుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి