
tamannaah Funny comments on F3 Movie Team
Tamannah : మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల కాంట్రవర్సీస్‌తో ఎక్కువగా వార్తలలో నిలుస్తున్న విషయం తెలిసిందే. దశాబ్ధంకి పైగా తన నటనతో పాటు అందచందాలతో మెప్పిస్తున్న తమన్నా త్వరలో ఎఫ్ 3 చిత్రంతో పలకరించనున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్2 చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్ గా ఎఫ్3 తెరకెక్కింది. మే 27న ఎఫ్ 3 చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో ప్రమోషన్స్ షురూ అయ్యాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది.
ప్రస్తుతం ఎఫ్ 3 ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రమోషన్స్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ పాల్గొంటున్నారు. మెహ్రీన్ కూడా ఉంటోంది. కానీ తమన్నా ఉంటే ఫ్యాన్స్ కి ఆ కిక్కే వేరు. తమన్నా ఎఫ్3 ప్రమోషన్స్ లో అంత యాక్టివ్ గా కనిపించడం లేదు.మొన్నటివరకు తమన్నా కేన్స్ లో బిజీగా గడిపింది. అది ఒక కారణం కావచ్చు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ముగిసిన తర్వాత కూడా తమన్నా ఎఫ్3 ప్రమోషన్స్ లో జాయిన్ కాలేదు. అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తోంది . తమన్నా ఎఫ్ 3 విషయంలో హర్ట్ అయిందని.. అందుకే దూరంగా ఉంటోందని అంటున్నారు. తమన్నా అలకకి కారణం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఎఫ్3 లో సోనాల్ చౌహన్ పాత్రకి ప్రాధాన్యత పెంచినట్లు ప్రచారం జరుగుతోంది.
tamannaah Funny comments on F3 Movie Team
దీనితో తమన్నా పాత్ర కాస్త తగ్గిందట. అయితే ఇందులో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ.. తమన్నా అలకకి కారణం ఇదే అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది.తమన్నా చేతిలో పెద్దగా సినిమాలు లేవు. ఇలాంటి టైమ్ లో ఓ క్రేజీ ప్రాజెక్టు వుంటే దాన్ని వాడుకోవాల్సి వుంది. అయినా కూడా పట్టించుకోలేదు అంటే సమ్ థింగ్..సమ్ థింగ్ అన్నమాట. కొన్నాళ్ల క్రితమే ఎఫ్ 3 యూనిట్ కు తమన్నాకు మధ్య ఏదో జరిగిందని వెల్లడిస్తే, అబ్బే అంతా ఊ ఉత్తుత్తినే అంటూ ఖండించారు. కానీ ఇప్పుడు ఈ సీన్ అంతా చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. రిలీజ్ కి ఇక రెండు రోజుల టైం మాత్రమే ఉంది. ఏది ఏమైనా అనిల్ రావిపూడి ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ లని మరింత అందంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.