Home » Entertainment » Tamannah Mesmerizing Looks
Entertainment

Tamannah : త‌మన్నా అందాల ర‌చ్చ‌.. ఆ అందాల‌కు ముగ్దుడు కాని వారుంటారా..!

Authored By
Sam C
The Telugu News | Published on: March 10, 2022, 12:30 pm
Advertisement

Tamannah : మిల్కీ బ్యూటీ త‌మన్నా టాలెంట్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌ల్టీ టాలెంటెడ్‌గా ఈ ముద్దుగుమ్మ అద‌ర‌గొడుతుంది.త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతోంది త‌మ‌న్నా. ఇన్నేళ్ల‌లో త‌మ‌న్నా అంటే ముందుగా గుర్తొచ్చేది మిల్కీ అందాలే.. తమన్న భాటియా శ్రద్ధ ప్రస్తుతం యాక్టింగ్ పైనా కంటే.. స్పెషల్ సాంగ్స్.. మ్యూజిక్ వీడియో సాంగ్స్ పైనే పెట్టినట్టు తెలుస్తోంది. అప్పటికే ఆమె డాన్స్ కు ఫిదా అవుతుంటారు ఆడియెన్స్.

Advertisement

బాలీవుడ్ పాప్ సింగర్స్ తో కలిసి తమన్న హాట్ స్టెప్పులేస్తే పరిస్థితి వేరేలా ఉంటుందని నిరూపించింది. ఇఫ్పటికే ఆల్ ఇండియా క్రష్ రష్మిక మండన్న హిందీలో ‘టాప్ టక్కర్’ మ్యూజిక్ వీడియో సాంగ్ లో నటించింది. కాగా తాజాగా మిల్క్ బ్యూటీ తమన్న భాటియా ‘తబహీ’ మ్యూజిక్ వీడియోలో బాలీవుడ్ సెలబ్రెటీ ర్యాపర్ బాద్షాతో లో కలిసి నటించింది. ఈ సాంగ్ కు హితేన్ మ్యూజిక్ అందించారు. యూట్యూబ్ లో ఈ సాంగ్ ట్రెండింగ్ మామూలుగా లేదు. ఇటీవ‌ల రిలీజ్ అయిన ఈ సాంగ్ కొద్ది గంటల్లోనే వైరల్ అయ్యింది.అయితే త‌మ‌న్నాలో ఎంతో టాలెంట్ ఉన్న‌ప్ప‌టికీ త‌న అంద‌చందాల‌తో అద‌ర‌గొడుతుంటుంది.

tamannah mesmerizing looks

Advertisement

Tamannah : త‌మ‌న్నా అందం అద‌ర‌హో..!

ఈ ముద్దుగుమ్మ త‌న అందాలు ఆర‌బోస్తూ కుర్ర‌కారు గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తుంటుంది. త‌మ‌న్నా అంద‌చందాల‌కు కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతుంటారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎద అందాల‌తో పాట న‌డుము అందాలు చూపిస్తూ కుర్ర‌కారు గుండెల్లో గుబులు రేపుతుంది. త‌మ‌న్నా క్యూట్ నెస్‌కి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. అంతేకాదు ఆమె అంద‌చందాల‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. ప్ర‌స్తుతం త‌మ‌న్నా పిక్స్ వైర‌ల్ గా మారాయి.త‌మ‌న్నా న‌టించిన ఎఫ్ 3 చిత్రం విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. ఇందులో వెంకీ స‌ర‌స‌న న‌టించింది ఈ ముద్దుగుమ్మ‌. అలానే చిరంజీవి భోళా శంక‌ర్ చిత్రంలోను న‌టిస్తుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి