
Taraka Ratna Wife : నందమూరి తారకరత్న గుండెపోటుతో ఫిబ్రవరి 18 న మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో తెలుగు ప్రజలంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఆయన మరణం నందమూరి ఫ్యామిలీని తీవ్ర విషాదంలో ముంచింది. అయితే తారకరత్నకు గుండెపోటు రాగానే బాలయ్య కుప్పం నుంచి బెంగళూరు హృదయాలయ ఆసుపత్రిలో చేర్చే వరకు అక్కడే ఉన్నారు. హాస్పటల్ డాక్టర్లతో తరచూ మాట్లాడుతూ మెరుగైన చికిత్స అందేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. తారకరత్న హాస్పిటల్ చేరిన దగ్గర నుంచి చివరిదాకా
Taraka Ratna Wife Alekhya Reddy comments about balayya
అతని వెంటే బాలయ్య ఉంటూ తన పనులను వాయిదా వేసుకున్నాడు. చివరికి తారకరత్న క్షేమంగా తిరిగి రావాలని చిత్తూరు జిల్లా బత్తలాపురంలో మృత్యంజనేయ స్వామి ఆలయంలో అఖండ దీపారాధన కూడా చేశారు. తారకరత్న స్పృహలో లేకపోయినా అతడితో మాట్లాడుతూ ధైర్యాన్ని నింపేవారు. చివరికి తారకరత్న మరణించిన తర్వాత అంత్యక్రియల విషయంలో తన అన్న మోహన కృష్ణ ముందు నడుస్తూ చితి చుట్టూ తిరిగారు. ఇన్ని రోజులు బాలకృష్ణ వేదనని చూసి తారకరత్న పై ఆయనకు ఉన్న ప్రేమ ఏంటో అర్థం అయింది.
Taraka Ratna Wife Alekhya Reddy comments about balayya
ఇక తాజాగా తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో బాలయ్య గురించి ఓ పోస్ట్ పెట్టింది. మేము కుటుంబమని చెప్పుకునే ఏకైక వ్యక్తి. మంచి చెడులో చివరి వరకు మాకు అండగా నిలిచారు. తండ్రిలా హాస్పటల్లో చేర్పించారు. బెడ్ పై పక్కన కూర్చొని తల్లిలా జోల పాడారు. సిల్లీ జోక్స్ చెబుతూ తనలో కదలికలు వచ్చేలా ప్రయత్నించారు. చుట్టూ ఎవరూ లేనప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారు అని అలేఖ్య రెడ్డి బాలకృష్ణ గురించి చెప్పుకొచ్చింది. అలాగే నువ్వు కొన్ని రోజులు ఉంటే బాగుండేది ఓబు అంటూ తారకరత్నను తలుచుకొని అలేఖ్యా తన ఇన్ స్టాలో షేర్ చేసింది.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.