ఆచార్య సినిమా మీద దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ నెలకొన్న సంగతి తెలిసిందే. సైరా లాంటి పాన్ ఇండియన్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి వస్తున్న ఆచార్య సినిమా ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ సినిమాగా మారింది. ఈ సినిమాకి సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ – మ్యాట్నీ మూవీస్ బ్యానర్స్ పై రాం చరణ్ – నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నారు.
ఇప్పటికే ఆచార్య సినిమా నుంచి రిలీజైన మోషన్ పోస్టర్ సినిమా మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్నదన్న విషయాన్ని తెలిపింది. కొరటాల శివ మార్క్ సామాజిక అంశాలకి పక్కా కమర్షియల్ అంశాలని జోడించి మాస్ ఎంటర్‌టైనర్ గా రూపొందిస్తున్నారు. దేవదాయ ధర్మ ధాయ శాఖలో పనిచేసే ఉద్యోగిగా చిరంజీవి పాత్ర ఉంటుందని సమాచారం. కాగా ఈ సినిమా కోసం ప్రతేకంగా వేసిన భారీ టెంపుల్ సెట్ ని రీసెంట్ గా మెగాస్టార్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది కూడా సినిమా మీద అంచనాలు పెరిగేలా చేసింది.
ఇక రీసెంట్ గా ఆచార్య సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న రాం చరణ్ కూడా జాయిన్ అయ్యాడు. ఆ విషయాన్ని చరణ్ లుక్ రిలీజ్ చేస్తూ తెలిపారు మేకర్స్. సిద్ద గా రాం చరణ్ పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని దర్శకుడు కొరటాల శివ చెప్పుకొస్తున్నాడు. అయితే తాజాగా చరణ్ కూడా జాయిన్ అయి షూటింగ్ సాగుతున్న క్రమంలో మేకర్స్ టీజర్ ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఆ టీజర్ కూడా రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26 న రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇక ఈ టీజర్ లో చరణ్ – చిరంజీవి కలిసి కనిపిస్తారని తెలుస్తోంది.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.