Tejaswini Nandamuri : బాలయ్య కూతురి గురించి తొలిసారి ఆసక్తికర విషయాలు వెల్లడించిన అల్లుడు..!
Tejaswini Nandamuri : తండ్రి వారసత్వంతో సినిమాల్లోకి వచ్చిన బాలయ్య ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. ఆయనకి ముగ్గురు పిల్లలు ఉన్న విషయం తెలిసిందే. అందులో ఇద్దరు అమ్మాయిలకు వివాహాలు అయిపోయాయి. దీంతో తన కొడుకు మోక్షజ్ఞను ఆయన సినిమాల్లోకి తీసుకు రావాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా వెల్లడించారు. అయితే నందమూరి అభిమానులు మోక్షజ్ఞ రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫలానా దర్శకుడు పరిచయం చేస్తున్నాడని, ఇప్పుడు యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడని, డ్యాన్స్ నేర్చుకుంటున్నాడని, మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్‌లో ఉన్నాడని రకరకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.
ఇక ఇదిలా ఉంటే బాలయ్య ఇప్పుడు కుర్రహీరోలకి పోటీగా సినిమాలు చేస్తున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ మూడు హిట్ సినిమాలు చేసి హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ కి సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం ఆయన బాబీ దర్శకత్వంలో ఎన్బీకే109 చిత్రంలో నటిస్తున్నారు. సరికొత్త మాస్ యాక్షన్ మూవీగా ఇది తెరకెక్కుతుంది. మరోవైపు తన కొడుకు కూతురిని కూడా ఇండస్ట్రీలో మంచి పొజీషన్‌లో ఉండేలా పావులు కదుపుతున్నారట. మోక్షజ్ఞ కంటే ముందే ఆయన కుమార్తె తేజస్విని సినిమాల్లోకి అడుగు పెట్టబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. బాలయ్య కూతురు ఎంట్రీపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని ఫిలిం నగర్ ఏరియాలో టాక్ వినిపిస్తోంది.
Tejaswini Nandamuri : బాలయ్య కూతురి గురించి తొలిసారి ఆసక్తికర విషయాలు వెల్లడించిన అల్లుడు..!
తేజస్వినిని నిర్మాతగా పరిచయం చేస్తున్నారు బాలయ్య. బోయపాటి శ్రీనుతో ఇటీవల సినిమాని ప్రకటించిన విషయం తెలిసింది. బీబీ 4 గా రాబోతున్న ఈ మూవీకి తేజస్విని సమర్పకురాలిగా వర్క్ చేస్తున్నారు. చాలా రోజులుగా బాలయ్య సినిమాలకి తెరవెనుక పనిచేస్తుందట. కాస్ట్యూమ్స్ సెలెక్షన్‌తోపాటు సినిమాల ఎంపికలోనూ ఆమె పాత్ర ఉంటుందని సమాచారం. క్రియేటివ్ సైడ్ తేజస్వికి చాలా ఆసక్తి ఉంటుందట. చాలా టాలెంటెడ్ కూడా అని చెప్పాడు ఆమె భర్త శ్రీ భరత్. ఆయన ఇటీవల ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. బాలయ్యకి అన్నీ తానై చూసుకుంటుందని చెప్పారు. అన్ స్టాపబుల్ టాక్ షో విషయంలో ఆమె ఇన్ వాల్వ్ మెంట్ ఉందట. ఆమె గైడెన్స్ ప్రకారమే బాలయ్య చేస్తున్నారు. గతంలో బాలయ్యకి కోపం ఎక్కువ అని తెలుసు. ఆని అన్‌స్టాపబుల్ తర్వాత ఆయనలో హ్యూమర్ ఉందని జనాలకి అర్ధమైంది. దానికి కారణం తేజస్వి అంటూ భరత్ తెలిపారు. ఆమె సినిమాల్లోకి వచ్చి ఉంటే పెద్ద హీరోయిన్ అయి ఉండేదని కూడా ఆయన తెలిపారు
Kannappa Movie Review : తెలుగు చిత్ర పరిశ్రమలో Kannappa Review పాపులర్ ప్రొడక్షన్ హౌస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ,…
kannappa Movie : మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన కన్నప్ప సినిమా రేపు గ్రాండ్‌గా విడుదల కానుంది.…
Ram charan : గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ కుడి చేయికి గాయం అయినట్లు వార్తలు వెలుగుచూస్తున్నాయి. బుధవారం హైదరాబాద్‌లోని శిల్పకళా…
Subhanshu Shukla : భారత అంతరిక్ష చరిత్రలో మరొక సువర్ణాధ్యాయం లిఖితమైంది. యాక్సియం-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా భారతీయుడు శుభాంశు…
Father : ఆస్తుల కోసం తల్లిదండ్రులను వేధించే ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా పడవేడు గ్రామానికి చెందిన…
Daughter : హైదరాబాద్ జీడిమెట్లలో జరిగిన ఓ హృదయవిదారక ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రేమకు అడ్డుగా మారిందనే కారణంతో పదో…
Phone Tapping Case : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మొదట చిన్న ఉదంతంలా కనిపించినా, ఇప్పుడది పెద్ద స్థాయిలో…
Heroine : చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో పాటు బిజినెస్ లతోనూ కోట్లు సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో కాస్ట్లీ…
This website uses cookies.