telugu comedian sudhakar clarifies about his affair with radhika
Tollywood : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ జనరేషన్ లో కన్నా… ముందు జనరేషన్ లోనే అద్భుతమైన కమెడియన్లు ఉండేవారు. ఒక బ్రహ్మానందం కావచ్చు.. ఒక అలీ కావచ్చు.. ఒక ఎమ్మెస్ నారాయణ కావచ్చు.. ధర్మవరపు సుబ్రహ్మణ్యం కావచ్చు.. వేణుమాధవ్ కావచ్చు… సుధాకర్ కావచ్చు… ఇలా చాలామంది కమెడియన్లు అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్లారు. ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది… ఎన్నో కామెడీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి… వాటి ద్వారా ఎలాగోలా తమ టాలెంట్ ను నిరూపించుకునే అవకాశం ఉంది కానీ.. అప్పట్లో.. టాలెంట్ ఉన్నా.. అవకాశాలు రాకుండా మరుగున పడిపోయిన ఎంతో నటులు ఇప్పటికీ ఉన్నారు.
telugu comedian sudhakar clarifies about his affair with radhika
కొన్ని రోజుల పాటు హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటుడు… తర్వాత కమెడియన్ గా మారి… ఎన్నో చిత్రాల్లో కామెడీ పంచి.. అందరికీ దగ్గరైన నటుడు, కమెడియన్ సుధాకర్. ఆయన గురించి ఈ జనరేషన్ కు తక్కువ తెలుసు కావచ్చు కానీ… ముందు తరం వాళ్లకు ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఎంతో కష్టపడి… సినిమా రంగంలో నిలదొక్కుకున్న నటుల్లో సుధాకర్ ఒకరు. ఆయన తెలుగుతో పాటు కన్నడ, తమిళం భాషల్లో సుమారు 600 కు పైగా సినిమాల్లో నటించారు.
1980వ దశకంలో సుధాకర్ కు ఉన్న క్రేజ్ మామూల్ది కాదు. అప్పట్లో ఆయన హీరోగా ఎక్కువ సినిమాలు చేశారు. అప్పట్లో స్టార్ హీరోయిన్ రాధికతో కలిసి చాలా సినిమాల్లో నటించి ఇద్దరిది హిట్ పెయిర్ అని ప్రశంసించేలా తమ పాత్రల్లో జీవించారు. రాధికతో కలిసి సుమారు 18 సినిమాల్లో నటించాడు సుధాకర్. ఇద్దరూ కలిసి ఎక్కువ సినిమాలు చేయడం… బయట కూడా ఇద్దరు ఎక్కువగా కనిపించడంతో… ఇద్దరికీ అఫైర్ ఉందంటూ అప్పట్లోనే చాలా వార్తలు వచ్చాయి.
telugu comedian sudhakar clarifies about his affair with radhika
కానీ.. అప్పట్లో తమపై వస్తున్న పుకార్లపై అటు రాధిక కానీ… ఇటు సుధాకర్ కానీ స్పందించలేదు. తర్వాత చాలా సినిమాల్లో సుధాకర్ కమెడియన్ గా నటించి… కొన్ని అనారోగ్య కారణాల వల్ల సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన సినిమాల్లో నటించడం లేదు. కానీ.. తన కొడుకు బెన్నిని మాత్రం సినిమా ఇండస్ట్రీకి త్వరలోనే పరిచయం చేయబోతున్నాడు సుధాకర్. ఈ సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు ప్రేక్షకులతో షేర్ చేసుకున్నాడు సుధాకర్.
ఇంటర్వ్యూలో రాధికతో తనకు అఫైర్ ఉందని అప్పట్లో వచ్చిన గాసిప్స్ పై తాజాగా నోరు విప్పాడు సుధాకర్. నాకు 1983లోనే పెళ్లయింది. అది కూడా పెద్దలు కుదిర్చిన వివాహమే. నా కొడుకు కూడా త్వరలోనే సినిమాల్లోకి వస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీ అంటేనే అప్పట్లో ఒక చెడు అభిప్రాయం ఉండేది. నేను, రాధిక కలిసి ఎక్కువ సినిమాల్లో నటించడం వల్ల మా ఇద్దరి మధ్య ఏదో ఉందని అంతా భ్రమపడ్డారు. కానీ… మా ఇద్దరి మధ్య ఏం లేదు. సినిమాల్లో నటించడం వరకే కానీ… ఆ తర్వాత ఆమె ఎవరో? నేను ఎవరో? అన్నీ అబద్ధాలు సృష్టించారు.. అంటూ సుధాకర్ తన మనసులో మాటను బయటపెట్టారు.
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల…
karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…
Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…
AP Mega DSC : ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.…
Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి Rajitha…
This website uses cookies.