Home » Entertainment » That Star Director Shown Rajashekhar As Villan
Entertainment

Rajashekhar : రాజశేఖర్‌ని విలన్ చేసిన స్టార్ డైరెక్టర్..అందుకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారో తెలుసా..?

Authored By
vamana sai
The Telugu News | Published on: August 17, 2021, 8:30 am
Advertisement

Rajashekhar : టాలీవుడ్‌లో ఇప్పుడు కొందరు స్టార్ హీరోలు కూడా విలన్ పాత్రల్లో నటించడానికి డిసైడవుతున్నారు. మంచి కటౌట్ ఉన్న జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్‌లో క్రేజీ విలన్‌గా స్టైలిష్ ఫాదర్‌గా గొప్ప పాత్రలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. ఆయన చేస్తున్న పాత్రలు ఇప్పుడు టాలీవుడ్‌లో చాలామంది హీరోలను ఇన్స్పైర్ చేస్తున్నాయి. జగపతి బాబును ఫాలో అవుతూ హీరో శ్రీకాంత్ కూడా విలన్‌గా మారాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్న అఖండ సినిమాలో పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

Advertisement

that star director shown rajashekhar-as villan

బాహుబలి సినిమాలో రానా దగ్గుబాటి పోషించిన పాత్ర కూడా విలన్ రోల్. హీరోగా నటించిన రానా ఇందులో విలన్ గా నటించి ఆకట్టుకున్నాడు. వి సినిమాలో నేచురల్ స్టార్ నాని కూడా చేసింది నెగిటివ్ రోల్ లోనే. బాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోలు విలన్ గా నటించారు. నటిస్తున్నారు. మన టాలీవుడ్‌లో ఈ ట్రెండ్ ఈ మధ్యనే మొదలైంది. ఇదే క్రమంలో సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్ మ్యాన్ డా.రాజశేఖర్ విలన్ గా మారబోతున్నాడని తాజా సమాచారం. ప్రముఖ దర్శకుడు రాజశేఖ్‌ని పవర్‌ఫుల్ విలన్‌గా చూపించబోతున్నాడట.

Advertisement

Rajashekhar : బాలకృష్ణ, చిరంజీవి లాంటి హీరోల సినిమాలలో విలన్ గా చేయడానికి అభ్యంతరం లేదన్నాడు.

that star director shown rajashekhar-as villan

ఆయనే శ్రీవాస్. యాక్షన్ హీరో గోపీచంద్ తో శ్రీవాస్ ఒక సినిమాను తెరకెక్కించబోతున్నాడు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించబోతున్నారు. ఇందులో ముందు వేరేవాళ్ళని విలన్ పాత్రకి తీసుకోవాలనుకున్నారట. కానీ ఈ క్యారెక్టర్ రాజశేఖర్ చేస్తే ఆ కిక్కు మరో లెవల్‌లో ఉంటుందని ఆయనని సంప్రదించారట. విలన్ రోల్ అయినా కూడా కథలో చాలా కీలకం కాబట్టే వెంటనే రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇక రాజశేఖర్ ఈ పాత్ర చేస్తున్నందుకు హీరోకి ఇచ్చినట్టుగానే ఆయనకున్న మార్కెట్‌ను బట్టి గట్టి ఆఫరే ఇచ్చారట. గతంలో రాజశేఖర్ కథ నచ్చితే బాలకృష్ణ, చిరంజీవి లాంటి హీరోల సినిమాలలో విలన్ గా చేయడానికి అభ్యంతరం లేదన్నాడు. ఆ అవకాశం ఇప్పుడు వచ్చిందంటున్నారు.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి