Intinti Gruhalakshmi Serial Rating of Swinging
Intinti Gruhalakshmi : స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి కూడా ఒకటి.. సరికొత్త కథనంతో ఊహించని ట్విస్ట్ లతో వీక్షకులను అలరిస్తూ నిన్నటితో 626 ఎపిసోడ్స్ ను పూర్తిచేసుకుంది.. ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ సీరియల్ అనూహ్యమైన మలుపు తిరుగుతూ వీక్షకులను అలరిస్తుంది.. గత వారం టీఆర్పీ రేటింగ్స్ లో రెండవ స్థానంలో నిలిచిన ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈ వారం ఏకంగా నాలుగవ స్థానానికి పడిపోయింది..! వచ్చేవారం ఈ ఒక్క సీన్ ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కథ మొత్తం మారిపోనుందా..!?అన్యోన్యంగా ఉంటున్న నందు తులసి ల మధ్య దూరాన్ని రేపింది లాస్య.. నందు కూడా లాస్య మాటలకు తన ప్రవర్తనకు దగ్గరై మెల్లమెల్లగా తులసిని దూరం చేసుకుంటూ లాస్య కు దగ్గర అయిపోయాడు. మధ్య మధ్యలో లాస్య నిజ స్వరూపం తెలుసుకున్నా..
తులసి మంచితనం గ్రహించినా లాస్య మాయలో చిక్కుకున్న నందు తననే పెళ్లి చేసుకుని.. లాస్య తో కలిసి ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు.. లాస్యకు ఇది ప్లస్ పాయింట్ అయితే.. నందు తన అమ్మానాన్నలకు దూరంగా ఉండలేక లాస్య తులసి పై నూరిపోసిన గరళాన్ని గొంతులో ఉంచుకోలేక నందు మనసులో వేదన పడుతూ మానసికంగా నలిగిపోతుంటాడు.జీకే గారి సమక్షంలో తులసి చేసిన శపదం నెరవేరే క్షణాలు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. తులసి ఆరోజు లాస్య తో నువ్వు కూడా నాకు మళ్ళే నీ ప్రవర్తన మార్చుకోకపోతే నందు నిన్ను వదిలేసి వెళ్లిపోవడం ఖాయం. పాతికేళ్లు ఆయన తో కాపురం చేసిన అనుభవంతో నీకు ఈ విషయాలను చెబుతున్నాను. నువ్వు కనుక నీ తీరును మార్చుకోకపోతే నందు నిన్ను వదిలేసి నా దగ్గరకు రావడం తథ్యం అని తులసి ముందుగానే హెచ్చరిస్తుంది..
These Sceen Changes Entire Intinti Gruhalakshmi Serial Story
అయినా లాస్య తన పంతాన్ని, కుట్రను వదులుకోదు.. తులసికి అడుగడుగున నష్టాలను చవి చూపిస్తుంది.. తను వెళ్లే మార్గం లో అడ్డుపడుతుంది.. లాస్య వేసే ముళ్ళ కంచెను తులసి తెలివిగా తప్పించుకుని ధైర్యంగా ముందుకు వెళ్తుంది..ఒక్కసారి లాస్య తప్పుల చిట్టా మొత్తం నందు కి తెలిసిపోతే లాస్య గతి తులసి చెప్పినదాని కంటే దారుణంగా ఉంటుంది. పరంధామయ్య హాస్పిటల్లో ఉన్నప్పుడు లాస్య దగ్గర డబ్బులు ఉన్నా కూడా.. తన డబ్బులు నందు వల్ల నాన్న ఆపరేషన్ ఇవ్వడానికి లాస్య ఒప్పుకోదు.. నందు తో పెళ్లి జరగడానికి లాస్య చేసిన కుట్రలు గురించి తెలిస్తే నందు లాస్య కి ఖచ్చితంగా దూరమవుతాడు.. అభి, ప్రేమ్, దివ్య కు లాస్య దగ్గరగా ఉంటూ.. వాళ్లందరినీ ఎలా నమ్మించి మోసం చేసిందో నందు కి ఆ మోసాల చిట్టా తెలిస్తే..
జీవితంలో నందు లాస్య నీ దగ్గరికి రానివ్వడు.. తులసి ఫ్యాక్టరీ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి కారణం లాస్య.. ప్రవళిక నందు కి లాస్య చేసిన కుట్రలు, కుతంత్రాలు తెలియజేస్తుంది. నందు తులసి మంచితనం తెలుసుకుని లాస్య దూరం అవ్వాలని నిశ్చయించుకుంటాడు. తులసి కాళ్ళ మీద పడిన నందు తనకు దగ్గరవ్వాలి అనుకుంటాడు. నందులో ప్రవళిక తీసుకువచ్చిన మార్పును తులసి యాక్సెప్ట్ చేస్తే ఈ సీరియల్ కథ వచ్చే వారం నుంచి మరోలా ఉంటుంది.. నందు తన తప్పు తెలుసుకుని లాస్య కు డివోర్స్ ఇచ్చి.. తులసి దగ్గరకు వస్తే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ రేటింగ్ నెంబర్ వన్ కి రావడం ఖాయం.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.