Home » Entertainment » Those Two Heroes Are Trying For Kiara Advani
Entertainment

Kiara Advani : కియారా అద్వానీ కోసం ఆ ఇద్దరు స్టార్ హీరోలు తెగ ట్రై చేస్తున్నారట..?

Authored By
vamana sai
The Telugu News | Published on: March 11, 2021, 7:00 am
Advertisement

Kiayara advani : కియారా అద్వానీ బాలీవుడ్ లో భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ చాలా బిజీగా ఉంది. వాస్తవంగా అయితే కియారా అద్వానీ టాలీవుడ్ లో క్షణం తీరిక లేకుండా ఉండాల్సింది. కాని ఇప్పడు మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది. కాని ఆ తర్వాత చేసిన వినయ విధేయ రామ అన్న సినిమా భారీ డిజాస్టర్ కావడంతో మళ్ళీ టాలీవుడ్ వైపు చూడలేదు. ఇక్కడ అవకాశాలు వచ్చినా కూడా కియారా డేట్స్ ఇవ్వలేని పరిస్థితి. చేతినిండా సినిమాలతో బాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో ఉంది.

Advertisement

those-two-heroes-are-trying-for-Kiara advani

అయినా ఎలాగైనా కియారా అద్వానీని టాలీవుడ్ కి తీసుకు రావాలని మేకర్స్ బాగానే ట్రై చేస్తున్నారు. డేట్స్ గనక అడ్జెస్ట్ అయితే ఆచార్య సినిమాలో చరణ్ కి జంటగా నటించాల్సింది. కాని కుదరలేదు. ఆ ప్లేస్ లో పూజా హెగ్డే వచ్చి చేరింది. అయితే ఏప్రిల్ నుంచి గాని లేదా మే నుంచి ఎన్.టి.ఆర్ – త్రివిక్రం కాంబినేషన్ లో ఒక పాన్ ఇండియన్ సినిమా మొదలవబోతోంది. హారిక అండ్ హాసినీ, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై రాధకృష్ణ, నందమూరి కళ్యాణ్ రాం కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Advertisement

Kiayara advani : కియారా అద్వానీ.. ఎన్.టి.ఆర్ ప్రాజెక్ట్ కి డేట్స్ ఇస్తుందా.. లేక రాం చరణ్ కా..?

అంతేకాదు మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ తో పాటు ఆచార్య సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ప్రకటన వచ్చిన ఈ సినిమాని దిల్ రాజు – శిరీష్ భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ లో కూడా కియారా అద్వానీ ని నటింపజేయాలని దిల్ రాజు ట్రై చేస్తున్నాడట. ఆల్రెడీ కియారాతో దిల్ రాజు మాట్లాడినట్టు సమాచారం. హిందీలో జెర్సీ సినిమాని నిర్మిస్తున్న దిల్ రాజు హైదరాబాద్ టు ముంబై ట్రావెల్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కియారాతో ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసినట్టు సమాచారం. మరి కియారా ఎన్.టి.ఆర్ ప్రాజెక్ట్ కి డేట్స్ ఇస్తుందా.. లేక రాం చరణ్ సినిమాకి ఇస్తుందా చూడాలి.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి