today horoscope in telugu
మేషరాశి ఫలాలు : ఈరోజు గతం నుంచి వస్తున్న సమస్యలు, బాధలు తగ్గుతాయి. మంచి రోజుల వైపు ప్రయాణిస్తారు. ఆఫీస్‌లో ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. కుటుంబానికి సంబంధించిన కొత్త పనులు లేదా కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. బంధుతో కలిసి ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారులకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వివాహం అయిన వారికి శుభ సమయం. ఇష్టదేవతారాధన చేసుకోండి. వృషభరాశి ఫలాలు :ఈరోజు అనుకోని చోట నుంచి ధనలాభాలు రావచ్చు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. కుటుంబ సబ్యుల సహకారం లభిస్తుంది. విద్యార్థులు ఈరోజు విజయాలను సాధిస్తారు. రుణవిముక్తి లభిస్తుంది. వైవాహికంగా సంతృప్తి జీవితం. దుర్గాదేవిని ఆరాధించండి.
today horoscope in telugu
మిథునరాశి ఫలాలు : ఈరోజు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మీ శాంతమే మీకు రక్ష. కోపతాపాలకు దూరంగా ఉండాల్సిన రోజు. పనులకు ఈరోజు ఆటంకాలు ఏర్పడతాయి. పెద్దల నుంచి చీవాట్లు తప్పవు. వైవాహికంగా జీవితం సాఫీగా సాగుతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు ప్రశాంతగా ఉంటారు. ఆఫీస్లో పనులు సాఫీగా సాగుతాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు. కుటంబ సభ్యుల ద్వారా శుభవార్తాలు వింటారు. పట్టుదలతో పనులు పూర్తి చేసుకుంటారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఎవరికి ఒకరికి అనారోగ్య సూచనలు కన్పిస్తున్నాయి. శ్రీ హనుమాన్ దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
సింహరాశి ఫలాలు : ఈరోజు ముఖ్య విషయాలపై దృష్టి పెడుతారు. ధనలాభాలు కన్పిస్తున్నాయి. వ్యాపారులకు లాభాలు వస్తాయి. కుటుంబంలో అనుకోని మార్పులు జరుగుతాయి. ప్రయాణాలు కలసి వస్తాయి. వైవాహిక జీవితంలో సుఖంమే లభిస్తుంది. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబం కోసం ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆంజనేయస్వామి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.
కన్యరాశి ఫలాలు : ఈరోజు మెదడుకు పదును పెట్టండి. ఎవరో చెప్పిన మాటలు వినకండి. మోసపోయే అవకాశాలు ఉన్నాయి. పనులు పెండింగ్‌లో పడుతాయి. కుటుంబంలో చికాకులు రావచ్చు. వ్యాపారులకు ఆర్థికంగా ఇబ్బంది.ప్రయాణాలు చేసే అవకాశం. ఆఫీస్‌లో వళ్లు వంచి పనిచేయాల్సిన సమయం. వైవాహింగా సాదారణంగా ఉంటుంది. శ్రీ వేంకటేశ్వర వజ్రకవచం కనీసం 3 సార్లు పారాయణం చేయండి.
today horoscope in telugu
తులారాశి ఫలాలు : ఈరోజు ఆవేశాలకు దూరంగా ఉండాలి. తెలివితో పనులు ప్రారంభించండి. ఓపికతో ఆఫీస్లో మెలగండి. ధన సంబంధ సమస్యలు రావచ్చు. దీని కోసం అప్పులు చేస్తారు. వాటి నుంచి గట్టెక్కుతారు. కుటుంబ సభ్యుల మద్య పరస్పర అవగాహన లోపం కనిపిస్తుంది. బంధువులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలు రావచ్చు. విద్యార్థులు బాగా శ్రమించాలి. నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి మంచి ఫలితాలు వస్తాయి.
వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు ఆనందం మీ సొంతం. ప్రయాణాలు కలసి వస్తాయి. కుటుంబ సబ్యుల నుంచి ప్రయోజనాలు పొందుతారు. కుటుంబం అందరూ సంతోషంగా ఉంటారు. వ్యాపారులు లాభాలను పొందుతారు. పెద్దల సహాకారం ద్వారా సూక్ష్మ విషయాలను తెలుసుకుంటారు. వైవాహికంగా సంతోషకరమైన రోజు. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు. కుటుంబ సభ్యుల నుంచి సహకారాలు లభిస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. అనారోగ్య బాధలు అధికమవుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు. వైవాహికంగా బాగుంటుంది. శ్రీ ఆంజనేయస్వామి దండకం పారాయణం చేయండి.
మకరరాశి ఫలాలు : ఈరోజు అన్నింటా విజయం. సమాజంలో మీకు మంచి పేరు, గౌరవం పెరుగుతుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. స్నేహితులకు సంబంధించిన విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారులకు ఆకస్మిక ధనలాభం. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వైవాహికంగా సంతోషం నిండిన రోజు. మరింత మంచి ఫలితాల కోసం హనుమాన్ దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
Daily horoscope in telugu
కుంభరాశి ఫలాలు : ఈరోజు ప్రతికూల ఫలితాలు రావచ్చు. వ్యాపారులకు ధన నష్ట సూచన కన్పిస్తుంది. ఆఫీస్లో ఓపికతో పనిచేయండి. కొత్త కార్యాలు ప్రారంభించకండి. ఆస్తుల విషయంలో జాగ్రత్త అవసరం. అన్ని రంగాలలో ఉన్న ఈరాశి వారికి ఇబ్బందులు పడుతారు. కానీ భగవన్నామ స్మరణ లేదా ఆంజనేయస్వామి ఆరాధనతో గట్టెక్కవచ్చు.
మీనరాశి ఫలాలు : ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు ఆఫీస్లో పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఈరోజు మీరు శుభవార్తలు వింటారు. కుటుంబంలో అభివృద్ధి. వైవాహికంగా సంతోషం, ఉల్లాసం మీసొంతం. విద్యార్థులు మంచి ఫలితాలు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
This website uses cookies.