Revanth Reddy : అసంబ్లీ లో మాస్టర్ ప్లాన్ తో ఎంట్రీ ఇవ్వబోతున్న రేవంత్..!
తెలంగాణ శాసనమండలి సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసినప్పటికీ, అసెంబ్లీ సెషన్‌ను మాత్రం పొడిగించి.. రిజిస్ట్రేషన్ చట్టం
Revanth Reddy : తెలంగాణ శాసనమండలి సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసినప్పటికీ, అసెంబ్లీ సెషన్‌ను మాత్రం పొడిగించి.. రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22ఏ, ధరణి అంశాలపై చర్చను కొనసాగించాలని రేవంత్ రెడ్డి సర్కారు తీసుకున్న నిర్ణయం వెనుక పకడ్బందీ రాజకీయ వ్యూహం దాగి ఉందనేది స్పష్టమవుతోంది. ఒక సెషన్ ముగింపు దశకు చేరుకున్నప్పుడు ఉభయ సభలూ ఒకేసారి నిరవధికంగా వాయిదా పడటం ఆనవాయితీ. కానీ అసెంబ్లీని మాత్రమే ప్రత్యేకంగా కొనసాగించడం ద్వారా.. గత బీఆర్ఎస్ పాలనలో ధరణి పోర్టల్ ముసుగులో జరిగిన చీకటి ఒప్పందాలను అసెంబ్లీ రికార్డుల్లో అధికారికంగా నమోదు చేయించేందుకు కాంగ్రెస్ ఒక భారీ వేదికను సిద్ధం చేసుకుంది. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా పక్కా స్కెచ్.. పాత గాయాలు రేపే వ్యూహం!ఈ చర్చ కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు విధాలుగా లాభించే అస్త్రం. మొదటిది.. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులు సస్పెన్షన్‌కు గురికావడంతో, సభలో ప్రభుత్వ దూకుడును అడ్డుకోవడానికి ప్రతిపక్ష గొంతుక లేకుండా పోయింది. స్పీకర్ వివాదం, అరెస్టుల చుట్టూ అల్లుకున్న రగడను పక్కకునెట్టి..
Revanth Reddy : అసంబ్లీ లో మాస్టర్ ప్లాన్ తో ఎంట్రీ ఇవ్వబోతున్న రేవంత్..!
నేరుగా ప్రజలతో ముడిపడి ఉన్న భూ సమస్యల వైపు దృష్టిని మళ్లించేందుకు సీఎం రేవంత్‌కు ఇది సువర్ణావకాశం. తెలంగాణ సమాజంలో ధరణి, సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల పట్టా భూములు నిషేధిత జాబితాలో (Prohibited Lands) చిక్కుకుపోవడం వల్ల రైతులు, మధ్యతరగతి ప్రజలు పడిన వేదన అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఈ సున్నితమైన అంశంపై రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా గుట్టు విప్పుతూ కీలక వివరాలు బహిర్గతం చేస్తే, అది ప్రజల్లో బీఆర్ఎస్పై ఉన్న పాత వ్యతిరేకతను మళ్లీ రగిలిస్తుందన్నది ప్రభుత్వ పక్కా వ్యూహం. రికార్డులతో సహా బట్టబయలు.. ‘భూ భారతి’తో సరికొత్త పరిష్కారం!గత ప్రభుత్వ హయాంలో ధరణిని అడ్డుపెట్టుకుని జరిగిన భారీ భూ బదలాయింపులు, ముఖ్యంగా హైదరాబాద్ శివార్లతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని విలువైన అసైన్డ్, ఇనాం, వక్ఫ్, దేవాదాయ భూములను సెక్షన్ 22ఏ నుంచి ఎలా తప్పించారు? వాటిని ఎవరి బినామీలకు కట్టబెట్టారు? అనే రికార్డులను రేవంత్ రెడ్డి సభ ముందు ఉంచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గతంలో ధరణిని నడిపిన ఒకరిద్దరు ఉన్నతాధికారులు, కీలక నేతల కనుసన్నల్లోనే వేల కోట్ల విలువైన భూముల నిషేధాలను ఎత్తివేశారనే ఆరోపణలు ఉన్నాయి.
వీటికి సంబంధించిన సర్వే నంబర్లు, రికార్డుల సవరణ జరిగిన తేదీలు, అక్రమ రిజిస్ట్రేషన్ల ఫైళ్లను స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టి ధరణి బండారాన్ని బట్టబయలు చేయనున్నారు. అదే సమయంలో, కాంగ్రెస్ కొత్తగా తీసుకొస్తున్న ‘భూ భారతి’ (Bhoo Bharati) ద్వారా తాము ఆ సమస్యలకు ఎలా చెక్ పెడుతున్నామో వివరించడం రేవంత్ ప్రధాన లక్ష్యం. నిషేధిత జాబితాలో అన్యాయంగా చిక్కుకుపోయిన నిజమైన రైతుల భూములకు విముక్తి కలిగించేందుకు రూపొందించిన విధివిధానాలను, కలెక్టర్లకు ఇచ్చిన అధికారాలను వివరిస్తూ.. తామే అసలైన పరిష్కారకర్తలం అనే ఇమేజ్ను సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. మొత్తంగా మండలిని పక్కనపెట్టి అసెంబ్లీలో 22ఏ చర్చను కొనసాగించడం బీఆర్ఎస్ను డిఫెన్స్‌లోకి నెట్టే పక్కా పొలిటికల్ చెక్‌మేట్. స్పీకర్ నిరసనలతో మైలేజ్ సాధించాలనుకున్న గులాబీ పార్టీకి, అసెంబ్లీ సాక్షిగా ‘ధరణి స్కామ్’ రూపంలో ఎదురుదెబ్బ కొట్టి.. రాజకీయంగా తన విశ్వరూపం చూపించేందుకు రేవంత్ రెడ్డి రంగం సిద్ధం చేశారు.







