tollywood hero naga shaurya married to anusha shetty
Naga Shaurya – Anusha Shetty : టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య, అనూష శెట్టి వివాహం బెంగళూరులో ఇవాళ ఉదయం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. వాళ్ల పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు నాగ శౌర్య పెళ్లి అని ఆయన అభిమానులకు కూడా చివరి నిమిషం వరకు తెలియదు. సడెన్ గా ఆయన పెళ్లికి సంబంధించిన వార్తలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
అందరూ నాగ శౌర్య పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు అని నెట్ లో వెతుకుతున్నారు. అసలు ఎవరు ఆమె.. ఏం చేస్తుంది.. వీళ్లిది లవ్ మ్యారేజా? లేక అరేంజెడ్ మ్యారేజా? అనేది చాలామందికి తెలియదు. వాళ్లది లవ్ మ్యారేజీనే. అనూష శెట్టిది బెంగళూరు. తను ఒక ఇంటీరియర్ డిజైనర్. తను ఇంటీరియర్ డిజైనర్ కావడంతో తన డిజైన్లు నాగశౌర్యకు బాగా నచ్చాయట. దీంతో తనకు కొన్ని పెద్ద కాంట్రాక్టులను నాగశౌర్య ఇప్పించాడట.
tollywood hero naga shaurya married to anusha shetty
అలా వాళ్లిద్దరి మధ్య స్నేహం చిగురించిందట. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందట. కొన్ని నెలల పాటు ప్రేమించుకున్న వీళ్లు ఆ తర్వాత వాళ్ల ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాలకు చెప్పడంతో వాళ్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అలా.. ఇద్దరి ప్రేమ పెళ్లి పీటల వరకు వచ్చింది. చివరకు ఇవాళ ఇద్దరూ ఒక్కటయ్యారు. అయితే.. ఇండస్ట్రీలో ఎంతో సైలెంట్ గా ఉండే నాగ శౌర్య… తన వెనుక ఇంత పెద్ద ప్రేమాయణం నడిపించాడా? అంటూ ఆయన అభిమానులు మాత్రం షాక్ అవుతున్నారు.
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
This website uses cookies.