Home » Entertainment » Tollywood Hero Sai Kumar Comments On Raja Sekhar
Entertainment

Raja sekhar : నేను రాజశేఖర్ విషయం పెద్ద తప్పు చేశా.. పశ్చాతాప పడ్డ సాయికుమార్

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: December 26, 2021 6:19 pm
Advertisement

Raja sekhar : సాయి కుమార్ పేరు చెబితేనే మనకు గుర్తొచ్చేది.. చట్టానికి, న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే అనే డైలాగ్. అలాగే.. సాయికుమార్ వాయిస్ కూడా అద్భుతంగా ఉంటుంది. పెద్ద పెద్ద స్టార్ హీరోలకు సాయికుమార్ డబ్బింగ్ చెప్పారు. రజినీ కాంత్ కు కూడా ఆయన డబ్బింగ్ చెప్పారు. హీరో రాజశేఖర్, సుమన్.. లాంటి వాళ్లకు కూడా సాయికుమార్ డబ్బింగ్ చెప్పేవారు. అప్పట్లో సాయికుమార్ వాయిస్ కు చాలా డిమాండ్ ఉండేది.నిజానికి..

Advertisement

సాయి కుమార్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే తన కెరీర్ ను మొదలు పెట్టారు. కానీ.. అనివార్య కారణాల వల్ల ఆ డబ్బింగ్ ను వదిలేశారు సాయికుమార్. పోలీస్ స్టోరీ సినిమాలో హీరోగా నటించి.. సూపర్ సక్సెస్ కొట్టాక.. ఇక సాయికుమార్ కు తిరుగు లేకుండా పోయింది.తాను ఒక ఎస్టాబ్లిష్ హీరో అయ్యాక.. సాయి కుమార్ ఇక డబ్బింగ్ చెప్పడం ఆపేశారు. ఇండస్ట్రీలోని అప్పటి పెద్దలు కూడా హీరో అయ్యాక.. నువ్వు డబ్బింగ్ చెబితే..బాగుండదు.. అంని సలహా ఇచ్చారట. దీంతో ఆ సలహాను పాటించి..

tollywood hero sai kumar comments on raja sekhar

Advertisement

Raja sekhar : ఇప్పుడు నువ్వు హీరోవు.. ఇంకా డబ్బింగ్ చెప్పడమేంటి అన్నారు

తర్వాత రాజశేఖర్, సుమన్ కు వాయిస్ ఇవ్వడం ఆపేశాడట సాయి కుమార్.రజనీకాంత్ లాంటి పెద్ద హీరోకు కూడా వాయిస్ ఇవ్వను.. అని అనేసరికి.. సాయి కుమార్ మీద ఇండస్ట్రీలో అప్పట్లోనే ఒకరకమైన అభిప్రాయం ఏర్పడిందట. అప్పుడు నేను రాజశేఖర్ కు కూడా డబ్బింగ్ చెప్పకుండా ఆపేసి.. చాలా పెద్ద తప్పు చేశాను అని ఇప్పుడు అనిపిస్తోంది.. అని సాయికుమార్ తాజాగా పశ్చాతాపపడ్డారు.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి