Home » Entertainment » Tollywood Heroes Prabhas Rana Loves Single Person
Entertainment

Prabhas – Rana : ప్ర‌భాస్,రానా ఒకే అమ్మాయిని ప్రేమించ‌డం ఏంటి గురూ?

Authored By
Sam C
The Telugu News | Updated on: July 1, 2022 4:34 pm
Advertisement

Prabhas – Rana : ఇటీవ‌ల సెల‌బ్రిటీల ప్రేమ‌, పెళ్లికి సంబంధించి తెగ వార్త‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. కొంద‌రు ప్రేమ‌లో ప‌డ్డార‌ని ప్ర‌చారం చేయ‌డం, మ‌రి కొంద‌రు విడిపోయార‌ని పుకార్లు పుట్టించ‌డం, ఇంకొందరు మ‌రో పెళ్లి చేసుకోబోతున్నార‌ని గాసిప్స్ క్రియేట్ చేయ‌డం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏది నిజమో ఏది అబ్తెద్ధ‌మో తెలుసుకోలేకపోతున్నాం. అయితే సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని వార్తలు నిజం చేశారు మన సెలబ్రిటీలు. స్టార్ హీరోయిన్ సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అని వాళ్ళు విడాకులు ప్రకటించే ఆరు నెలల ముందు నుండే సామాజిక మాధ్యమాలల్లో వార్తలు వినిపించాయి.

Advertisement

చివ‌ర‌కు అదే నిజం చేసారు. గ‌త ఏడాది అక్టోబ‌ర్ 2న విడిపోయారు. ఇక కాజ‌ల్ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వచ్చాయి. కానీ కాజల్ ఆ వార్తలను ఖండిస్తూ వచ్చినా..ఫైనల్ గా గర్భవతిని అంటూ ఓపెన్ అప్ అయ్యింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. స్టార్ హీరో రానా..పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇద్దరు ఓకే అమ్మాయిని ప్రేమించార‌ట‌. వీరిద్ద‌రు మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. బాహుబలిలో వీళ్ళ నటనకి ప్రపంచ దేశాలు ఫిదా అయ్యాయి. అయితే, రానా గతంలో హీరోయిన్ త్రిష తో లవ్ ఎఫైర్‌ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. వీరిద్దరికి సంబంధించి ప‌లు ఫొటోలు కూడా హ‌ల్చ‌ల్ చేశాయి.

tollywood heroes Prabhas – Rana loves single person

Advertisement

Prabhas – Rana : క్రేజీ గాసిప్…

అయితే రానా-త్రిష ల‌వ్ అంటే ఎవ‌రు పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌పోవ‌డం లేదు కాని ప్ర‌భాస్‌- త్రిష అనే స‌రికి ఉలిక్కిప‌డుతున్నారు. ప్రభాస్ కి కూడా త్రిష తో లవ్ ట్రాక్ నడించిందని..వర్షం సినిమా టైం నుండే.. వీళ్ల లవ్ మొదలైందని ..ఆ తరువాత బుజ్జిగాడు, పౌర్ణమి సినిమాలతో ఆ లవ్ స్ట్రాంగ్ అయ్యిందని వార్తలు వినిపించాయి. కానీ, ఇద్దరు అమ్మడి ని పెళ్లి చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూయించలేదట‌. రానా ప్రేమ వివాహం చేసుకోగా..త్రిష నిశ్చితార్ధం చేసుకుని, క్యాన్సిల్ చేసుకున్నింది . ప్రభాస్ మాత్రం సింగిల్ గానే కాలం గడుపుతున్నాడు. సోలో లైఫే సో బెట‌ర్ అంటూ మ‌నోడు ఇంకా బ్యాచిల‌ర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆయ‌న పెళ్లిపై ఎన్ని పుకార్లు వ‌చ్చిన ప్ర‌భాస్ మాత్రం స్పందించ‌డం లేదు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి