Tollywood : టాలీవుడ్ సూపర్ స్టార్ లు ఎక్కువగా సక్సెస్ ను నమ్ముతారు. సక్సెస్ వచ్చిన వాళ్లకు మాత్రమే వారు సపోర్ట్ గా నిలుస్తారు. సక్సెస్ ఉన్న సమయంలో వారితో వర్క్ చేస్తారు. ఒక్క ప్లాప్ వచ్చినా వారిని పక్కకు పెడతారు. సక్సస్ వచ్చిన సమయంలో ఆహా ఓహో అంటూ వారిని నెత్తిన పెట్టుకొని ఆకాశానికి ఎత్తేసే మన స్టార్స్ ఒకటి రెండు ప్లాప్ లు పడగానే పక్కన పెట్టేస్తారు. ఈ విషయం పలు సందర్భాల్లో నిర్ధారణ అయింది. టాలీవుడ్ స్టార్ హీరోలు సక్సెస్ అయిన టెక్నీషియన్స్ తో మాత్రమే వర్క్ చేసేందుకు ఆసక్తి చూపిస్తారని చాలా సందర్భాల్లో క్లారిటీ వచ్చింది.సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ విషయంలో కూడా అదే రిపీట్ అయింది.
తమిళంలో అనిరుధ్ సూపర్ డూపర్ సంగీత దర్శకుడు అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక అద్భుతమైన ఎంట్రీ ని తమిళనాట ఇచ్చిన అనిరుద్ తెలుగులో మాత్రం ఫ్లాప్ ఎంట్రీ ఇచ్చాడు. అజ్ఞాతవాసి సినిమా తో పవన్ కళ్యాణ్ సినిమాకు సంగీతాన్ని ఇచ్చిన ఆయన తెలుగు లో ఎంట్రీ ఇచ్చాడు. అనిరుద్ సంగీతం అందించిన ఆ సినిమా ఫ్లాప్ అవడంతో మళ్లీ పెద్ద సినిమాల ఛాన్స్ రాలేదు. కాని తమిళ సూపర్ స్టార్స్ కి అందరికీ కూడా ఆయనే మోస్ట్ వాంటెడ్. ఆయనకు ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా తమ సినిమాలకు సంగీతాన్ని చేయాలని పెద్ద పెద్ద స్టార్స్ అంతా కోరుకుంటారు.తాజాగా విజయ్ నటించిన బీస్ట్ సినిమా కోసం అరబిక్ కుత్తు ట్యూన్ చేసిన అనిరుద్ దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాడు.
ఇలాంటి పాటలు కూడా ఉంటాయా అంటూ అంతా ముక్కున వేలేసుకునేలా చేశాడు. సౌత్ ప్రేక్షకులనే కాదు తన పాటతో మొత్తం దేశ వ్యాప్తంగా ఉన్న సంగీత అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు. ఇప్పటికైనా తెలుగు స్టార్ హీరోలు అనిరుద్ పై ఆసక్తిని కనబర్చుతారా అనేది చూడాలి. ఎప్పుడు సేమ్ సంగీతాన్ని ఇచ్చే తమన్ ను కాదని.. కాపీ ట్యూన్స్ ఇచ్చే వారిని కాదని మన స్టార్ దర్శకులు ఒక్కసారి అనిరుద్ రవిచంద్రన్ కు అవకాశం ఇస్తే బాగుంటుంది. మన తెలుగు స్టార్ హీరోలు ఒక్క సారి అవకాశం ఇవ్వడం మొదలు పెడితే అనిరుద్ తన సత్తా చాటి తమన్ ను పక్కకు నెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.