samantha another intresting comments
Samantha : ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ సమంత. చూడ చక్కని అందం ఆకట్టుకునే అభినయంతో అశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ ముద్దుగుమ్మ విడాకుల తర్వాత జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. నాగ చైతన్యతో సమంత వేరు పడ్డ తరువాత వచ్చిన వార్తలు, ప్రచారం చేసిన రూమర్లు అందరికీ తెలిసిందే. సమంత మీద నానా రకాల రూమర్లు వచ్చాయి. అక్రమ సంబంధాలను సమంతకు అంటగట్టారు. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ అవేమి పట్టించుకోకుండా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా సమంత సోషల్ మీడియాలో హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తూ వస్తుంది.సమంత రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
కేవలం 10 నిమిషాల ఐటమ్ సాంగ్‌లో నర్తించినందుకు… కోట్లు తీసుకునే స్థాయికి సామ్ వెళ్లారు. ఇక నాగచైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం.. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయిన సమంత మోటివేషన్ కొటేషన్స్ పెడుతూ నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. ఆమె ఏదైనా పోస్ట్ పెడితే చాలు.. ఫ్యాన్స్ ఇట్టే వైరల్ చేస్తున్నారు. జీవితంలో ఎదుగుదలకు క్రమశిక్షణ ఎంత ప్రధాన భూమిక పోషిస్తోందో సమంత చెప్పకనే చెబుతుంది.సమంత తన తాజా పోస్ట్‌లో “డిసిప్లెన్‌గా ఉండాలని ఒకరు చెప్పాల్సిన పనిలేదు, క్రమశిక్షణ మనల్ని బలంగా తయారుచేస్తుంది. క్రమశిక్షణతో ఉంటే తాత్కాలిక ఆనందాలు దక్కకపోయినప్పటికీ.. మున్ముందు అంతకుమించిన ఫలితాలు దరికి చేరతాయి. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఇదే పునాది కూడా.
samantha another intresting comments
మీరు కోరుకున్నవన్నీ మీకు ఇచ్చేంతగా మిమ్మల్ని మీరు ప్రేమించడం కూడా తప్పనిసరి” అని సమంత తన పోస్ట్‌లో పేర్కొంది. ఇదిలా ఉంటే సమంత విడాకుల విషయం నుంచి మెల్లిగా బయిటకు వస్తోంది. తన జీవితం తనదే అన్నట్లు ఎంజాయ్ చేస్తోంది. గత కొంతకాలంగా నాగచైతన్య…సమంత విడాకుల ప్రకటన ఒక్కసారిగా జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయ్యింది. టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ అంటూ పేరు తెచ్చుకున్న ఈ జంట ఇలా ఆకస్మాత్తుగా విడిపోవడం ఏంటని అభిమానులతోపాటు.. సినీ ప్రముఖులు సైతం షాకయ్యారు. అయితే వీరిద్దరి విడాకుల ప్రకటన అనంతరం సమంత పై పూర్తిగా నెగిటివిటి వ్యాప్తి చెందింది.
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
This website uses cookies.