Pushpa 2 Movie Story Leak : పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమా కేవలం తెలుగు ఇండస్ట్రీనే కాదు.. యావత్ ప్రపంచాన్నే షేక్ చేసింది. పుష్ప సినిమాకు ముందు అల్లు అర్జున్ కేవలం తెలుగు హీరో మాత్రమే కానీ.. ఇప్పుడు పాన్ ఇండియా, గ్లోబల్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. పుష్ప సినిమా ఇతర దేశాల్లో వాళ్ల బాషల్లో కూడా విడుదల చేయడంతో ఒక తెలుగు సినిమా అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకుంది. ఈ సినిమాకు నార్త్ లో అయితే వందల కోట్లు వచ్చాయి. ఈ సినిమాకు నార్త్ లో బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా గురించి ఇక ఎంత చెప్పినా తక్కువే.
పుష్పకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమా వస్తోంది. 2021 డిసెంబర్ లో పుష్ప సినిమా వచ్చింది. పుష్ప 2 సినిమా రిలీజ్ కు ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటోంది ఈ సినిమా. అయితే.. ఈ సినిమాకు సంబంధించిన ఒక గ్లింప్స్ ను తాజాగా మూవీ యూనిట్ విడుదల చేసింది. ఆ గ్లింప్స్ చూస్తే చాలు.. ఈ సినిమా కథ ఏంటో తెలిసిపోతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ లో పుష్ప ఆరితేరుతాడు. కానీ.. పోలీస్ షెకావత్ తో పుష్పకు గొడవ ఉన్న విషయం తెలిసిందే. పుష్ప ఎర్రచందనం సామ్రాజ్యాన్ని కూల్చేసి పుష్పను తిరుపతి జైలులో వేస్తాడు. కానీ.. జైలు నుంచి పుష్ప తప్పించుకుంటాడు.
పుష్పను పట్టుకోవడానిక షెకావత్ చాలా ప్రయత్నిస్తాడు. గన్ తో కాల్చుతాడు. అయినా కూడా బైక్ మీద బుల్లెట్ గాయాలతో తప్పించుకుంటాడు పుష్ప. ఆ తర్వాత పుష్ప ఎక్కడికి వెళ్లాడో ఎవ్వరికీ తెలియదు. అసలు పుష్ప ఎక్కడ అంటూ అందరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ.. పుష్ప ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలియదు. ఇదే పుష్ప 2 కథ అన్నట్టుగా తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ వీడియో చెబుతోంది. అయితే.. ఏప్రిల్ 7న పుష్ప 2 కి సంబంధించి మరో అప్ డేట్ ను ఇవ్వబోతున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.