Samantha : శాకుంతలం సినిమా గురించి టాప్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు .. సమంత ఏమనుకున్నా సరే అంటూ చెప్పేసింది !
Samantha : ఇటీవల గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ‘శాకుంతలం’ అనే సినిమా చేయటం తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. సమంత ఫస్ట్ టైం పౌరాణిక నేపథ్యంలో నటించిన ఈ సినిమాలో.. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో ‘శాకుంతలం’ ఫెయిల్యూర్ నీ చాలా లైట్ తీసుకోవడం జరిగింది. అయితే ఈ సినిమా ఫెయిల్యూర్ పై సీనియర్ హీరోయిన్ మధుబాల స్పందించింది. ‘శాకుంతలం’ సినిమా పరాజయం పాలు కావటం బాధ కలిగించిందని కామెంట్లు చేయడం జరిగింది.
top heroines comments about Samantha shaakuntalam movie failure
ప్రేక్షకులను మెప్పించడం కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. ఇలాంటి సినిమా అట్టర్ ఫ్లాప్ కావటం చాలా బాధాకరంగా ఉంది. ‘శాకుంతలం’ సినిమా విజయం సాధించాలని దర్శక నిర్మాతలు కష్టపడి పనిచేసినప్పటికీ… సక్సెస్ దక్కకపోవడం నన్ను ఎంతగానో బాధించింది. సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ నుంచి రిలీజ్ అయ్యే వరకు ప్రతి ఒక్కరూ ఎంత కష్టపడ్డారో దగ్గరుండి చూశాను. ఇంతగా కష్టపడినా సినిమా ఫలితం నిరాశ కలిగించడం నన్నెంతగానో బాధించింది.
Samantha Shaakuntalam Movie review
ఆడియన్స్ కి విజువల్ ట్రీట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో సినిమా యూనిట్ సభ్యులు షూటింగ్ పూర్తయిన తర్వాత దాదాపు సంవత్సరకాలం పడ్డ శ్రమ గురించి కూడా తెలుసు. సినిమా షూటింగ్ సమయంలో అంతా ప్రశాంతంగా వర్క్ చేసే అవకాశం ను మేకర్స్ కల్పించారు. “బాహుబలి”, “RRR” సినిమాల విజయాలకు సరైన కారణం లేదు. మా సినిమా ఎలా బాక్స్ ఆఫీస్ వద్ద పడుతుందని మేము అనుకోలేదు.. అని సీనియర్ హీరోయిన్ మధుబాల… ‘శాకుంతలం’ పరాజయంపై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
