Home » Entertainment » Top Producer Said Sorry Prabhas And Canceled The Movie
Entertainment

Prabhas : క్షమించు ప్రభాస్ అంటూ సారీ చెప్పి మరీ ఆ సినిమా క్యాన్సిల్ చేసిన టాప్ ప్రొడ్యూసర్ !

Authored By
Breaking News
The Telugu News | Updated on: May 9, 2023 1:55 pm
Advertisement

Prabhas : పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మంచి జోరు మీద ఉన్నాడు. ఈ ఏడాది రెండు సినిమాలు విడుదల చేయబోతున్నాడు. “బాహుబలి” తర్వాత ఒక్క విజయం కూడా ప్రభాస్ కి వరించలేదు. అయితే త్వరలో ఆదిపురుష్, సలార్ సినిమాలతో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాడు. ఈ సినిమాలు చేస్తూనే మరి కొన్ని ప్రాజెక్టులు ప్రభాస్ లైన్ లో పెట్టడం జరిగింది. దక్షిణాది సినిమా రంగంలోనే అతిపెద్ద బ్యానర్ గా పేరుగాంచిన మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో కూడా ప్రభాస్ సినిమా ఒప్పుకోవడం తెలిసిందే.

Advertisement

top producer said sorry Prabhas and canceled the movie

ఈ సినిమాని బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహించడానికి రెడీ అయ్యారు. ఇందుకుగాను సిద్ధార్థ ఆనంద్ కి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఐదు కోట్లు అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం సిద్ధార్ధ్ “ఫైటర్” అనే సినిమా చేస్తున్నారు. దీని తర్వాత పటాన్ వర్సెస్ టైగర్ సినిమా స్టార్ట్ చేయాల్సి ఉంది. దీంతో ఇప్పుడు ప్రభాస్ మూవీని అర్ధాంతరంగా సిద్ధార్థానంద్ క్యాన్సిల్ చేసుకోవడం జరిగిందట.

Advertisement

ప్రాజెక్ట్ నుండి సడన్ ఇంకా తప్పుకోవలసి రావటంతో ప్రభాస్ కి సారీ కూడా చెప్పినట్లు సమాచారం. బాలీవుడ్ ప్రాజెక్టుకి ప్రాధాన్యత ఇస్తూ ప్రభాస్ ప్రాజెక్టుని ఈ టాప్ డైరెక్టర్ పక్కన పెట్టినట్లు వినికిడి. ప్రస్తుతం ప్రభాస్… సలార్, ప్రాజెక్టుకే షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. “ఆదిపురుష్” వచ్చే నెలలో విడుదల కానున్న నేపథ్యంలో..ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో మరికొద్ది రోజుల్లో పాల్గొనబోతున్నారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి